![Stock market: ఈ ఫాల్ ఆగేదెప్పుడు.. అంత వరకు వెయిట్ చేయాల్సిందేనా..?](https://static.v6velugu.com/uploads/2025/02/when-will-the-stock-market-stop-falling-look-out-for-these-signs_oGNJQXhF5r.jpg)
స్టాక్ మార్కెట్ లో ఫాల్ ఆగటం లేదు. వరుసగా గత ఐదు రోజులుగా ఉన్న సెల్లింగ్ ప్లెజర్ బుధవారం (ఫిబ్రవరి 12) కూడా కొనసాగింది. దీంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కంటిన్యూ అయ్యింది. ఇవాళ్టి ట్రేడింగ్ లో తీవ్ర ఒడిదుడుకులకు గురైన సెన్సెక్స్ మార్కెట్లు ముగిసే సమయానికి123 పాయింట్లు తగ్గి 76,171.08 కి చేరుకుంది. ఇక నిఫ్టీ 50 క్లోజింగ్ టైమ్ కు 27 పాయింట్ల లాస్ తో 23,045.25 దగ్గర ముగిసింది. BSE మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వరుసగా 0.45%, 0.49% పతనం అయ్యాయి.
గత ఆరు రోజులుగా మార్కెట్ ఫాల్ తో సెన్సెక్స్ మొత్తం 2,413 పాయింట్లు (3%) కోల్పోగా, నిఫ్టీ 694 పాయింట్లు (2.92%) పడిపోయింది. ఈ ఆరు సెషన్లలో (ఫిబ్రవరి 4 నుంచి) ఇన్వెస్టర్లు మొత్తం 18 లక్షల కోట్లు నష్టపోయారు.
మార్కెట్లు ఇవాళ బుధవారం (ఫిబ్రవరి 12) ఫ్లాట్ గా మొదలైనప్పటికీ.. సెల్లింగ్ ప్రెజర్ తో నిఫ్టీ ఒకానొక టైమ్ లో 22,800 లెవల్ కు వెళ్లి అక్కడ సప్పోర్ట్ తీసుకుని 23,000 లెవల్ వద్ద స్థిరపడింది. టెక్నికల్ గా నిఫ్టీ సపోర్ట్ 23,000 దగ్గర ఉంది. దీనికి దిగువన నెక్స్ట్ సపోర్ట్ 22,800 ఉంది. అదే విధంగా 23200-23300 రెసిస్టెంట్ జోన్ గా ఉంది. ఏదైనా మార్కెట్ బూస్ట్ ఇచ్చే తాత్కాలిక న్యూస్ వచ్చినా ఈ సపోర్ - రెసిస్టెంట్ రేంజ్ లో నిఫ్టీ కొన్నాళ్లు ఉండే ఛాన్స్ ఉంది.
ఫాల్ ఎప్పుడు ఆగవచ్చు..?
ట్రంప్ టారిఫ్ లు మార్కెట్లను భయపెడుతున్నాయి. ఇప్పటికే అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై 25 శాతం పన్నులు విధించనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా రెసిప్రోకల్ ట్యాక్స్ విధిస్తామని ప్రకటించడం గ్లోబల్ మార్కెట్స్ లో పతనానికి కారణం అయ్యింది. రెసిప్రోకల్ ట్యాక్స్ అంటే.. ఇతర దేశాలు యూఎస్ గూడ్స్ పై ఎంత ట్యాక్స్ విధిస్తే అంత ట్యాక్స్ వాళ్లపై విధించడం. ఈ ఎఫెక్ట్ తో ఫార్మా, ఐటీ, జెమ్స్, జువెలరీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. రెసిప్రోకల్ టాక్స్ లు, టారిఫ్ లపై క్లారిటీ వస్తే మార్కెట్లు కాస్త కూల్ ఆఫ్ అవుతాయని మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ అనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా చెబుతున్నారు.
ఫారిన్ ఇన్వెస్టర్ల (FII ) సెల్లింగ్:
యూఎస్ బాండ్ ఈల్డ్స్ (బాండ్ ఈల్డ్స్ అంటే బాండ్స్ పై పెట్టిన పెట్టుబడికి వచ్చే రిటర్న్స్), డాలర్ పెరుగుతుండటం.. ఇండియన్ రూపీ తగ్గుతుండటంతో భారీగా అమ్మేసీ అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారు. అక్టోబర్ 2024 నుంచి ఇప్పటి వరకు 2.75 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ మార్కెట్ల నుంచి అమ్మేశారు. డాలర్, బాండ్స్ కూల్ ఆఫ్ అయితే ఇండియా నుంచి సెల్లింగ్ ఆగుతుందని, అది మార్కెట్లు స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని ప్రముఖ అనలిస్ట్ సిద్ధార్త్ భామ్రే అన్నారు.
Also Read :- ఐ ఫోన్.. రూ.20 వేలకే కొనే ట్రిక్..
డాలర్ ఇండెక్స్:
గత రెండు నెలలుగా డాలర్ ఇండెక్స్ సిగ్నిఫికెంట్ గా బలపడుతూ వస్తోంది. ఇటీవల 108 స్థాయికి చేరిన ఇండెక్స్ తాజాగా 107 దగ్గర ఉంది. దీంతో రూపాయి డాలర్ తో పోల్చితే లైఫ్ టైమ్ లో 87కు పడిపోయింది. డాలర్ ఇండెక్స్ మళ్లీ 104 లెవల్ కు పడిపోతే రూపాయి స్ట్రెంతెన్ అవుతుంది. మార్కెట్ రివర్స్ (పాజిటివ్) కావడానికి అదొక ఫస్ట్ సూచన కావచ్చు అని ప్రముఖ ఎనలిస్ట్ దేవెన్ చోక్సీ అంటున్నారు.
ఇండియన్ కంపెనీల ఫలితాల ప్రభావం:
ఇండియన్ కంపెనీలు ఈ క్వార్టర్ రిజల్ట్స్ (Q3 అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్) అనుకున్నంత బెస్ట్ గా రాకపోవడం.. అయినప్పటికీ మరీ దారుణంగా ఫలితాలేం లేవు. అయితే వచ్చే క్వార్టర్ కు మేనేజ్ మెంట్ గైడెన్స్, రిజల్ట్స్ బాగుంటే మార్కెట్లు మళ్లీ పాజిటివ్ పాత్ లోకి వచ్చే చాన్స్ ఉంటుందని సిద్ధార్థ భామ్రే చెబుతున్నారు.
అయితే త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలవనున్నారు. ఈ మీటింతో ఎకానమీ బూస్ట్ అవ్వడానికి, మార్కెట్లు స్టెబిలైజ్ అయ్యే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారేమో చూడాలి.