ఎక్కడికి పోయారు వీళ్లంతా? సికింద్రాబాద్​ తహసీల్దార్​ ఆఫీస్​ ఉద్యోగులపై ​కలెక్టర్​ సీరియస్​

ఎక్కడికి పోయారు వీళ్లంతా? సికింద్రాబాద్​ తహసీల్దార్​ ఆఫీస్​ ఉద్యోగులపై ​కలెక్టర్​ సీరియస్​
  • టైంకు ఆఫీసుకు రాకపోతే ఎట్లా ? 
  •  ఆకస్మిక తనిఖీకి రాగా తహసీల్దార్, మరో 9 మంది కుర్చీలు ఖాళీ 
  •  అందరికీ నోటీసులిచ్చిన అనుదీప్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: టైంకు ఆఫీసుకు రాని సికింద్రాబాద్​తహసీల్దార్​తో పాటు సిబ్బందిపై హైదరాబాద్​కలెక్టర్​అనుదీప్​ఫైర్​అయ్యారు. ఇక నుంచి ఎవరు టైంకి ఆఫీసుకు రాకపోయినా యాక్షన్​తప్పదని హెచ్చరించారు. సోమవారం సికింద్రాబాద్ తహసీల్దార్​ఆఫీసును కలెక్టర్​అనుదీప్​ఉదయం పదిన్నర గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆఫీసులో తహసీల్దార్ పాండునాయక్​తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది కనిపించలేదు. దీంతో ‘ఇంత టైం అవుతుంటే వీళ్లంతా ఎక్కడికి పోయారు’ అంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అక్కడే ఉన్న రిజిష్టర్​చూసి ఎవరెవరు రాలేదు..ఎందుకు రాలేదు అని ఆరా తీశారు. పది నిమిషాల తర్వాత వచ్చిన తహసీల్దార్​పాండునాయక్ ను ఎందుకు లేటయ్యిందని ప్రశ్నించారు. దీంతో గత సోమవారం రాత్రి రాజీవ్​ యువవికాసం అప్లికేషన్ల వెరిఫికేషన్​చేశామని, అందువల్ల ఉదయం కాస్త ఆలస్యమైందని సమాధానమిచ్చారు. 

 అయినా, ముందస్తు సమాచారం లేకుండా టైంకు ఆఫీసుకు రావడంతో తహసీల్దార్ ఈ.పాండునాయక్ తో పాటు సర్వేయర్ కె.కిరణ్ కుమార్, ఏఆర్ఐ పి.ప్రసన్నలక్ష్మి స్పెషల్ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​బి.జే పాల్, స్పెషల్ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​షేక్ మోయినుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ జి.అనూష, రికార్డ్ అసిస్టెంట్ ఎం.మినేశ్, రికార్డ్ అసిస్టెంట్ ఎం.ప్రమోద్, రికార్డ్ అసిస్టెంట్ రాజశేఖర్, ఆఫీస్ సబార్డినేట్ బి.మాలతి, చైన్​మెన్​పి.సతీశ్​లకు  షోకాజ్​నోటీసులిచ్చారు.

యువవికాసం వెరిఫికేషన్​ త్వరగా పూర్తి చేయండి  

సికింద్రాబాద్ మండలంలో ప్రజల నుంచి వచ్చిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతమంది ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నారు? ఎన్ని దరఖాస్తులను ఫిజికల్ వెరిఫికేషన్, స్క్రూటినీ చేశారు అని తహసీల్దార్​ను అడిగి తెలుసుకున్నారు. 7327 మంది ఆన్​లైన్​లో అప్లై చేసుకున్నారని, ఇందులో 2,572మంది మాత్రమే ఆఫీసులకు వచ్చి దరఖాస్తులు ఇచ్చారని చెప్పారు. కలెక్టర్​వెంట ఆర్డీవో పి. సాయిరాం ఉన్నారు. 

నీట్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి  

నీట్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీట్ నిర్వహణపై సెంటర్ సూపరిండెంట్లు, కోఆర్డినేటర్లు, వివిధ బ్యాంకులు, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మే 4న జరగబోయే పరీక్షకు జిల్లాలో 62 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 26,609 మంది ఎగ్జామ్​రాయబోతున్నట్లు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.