Vastu tips: ఇంట్లో ఎలక్ట్రికల్​ వస్తువులు ఏ దిక్కున ఉండాలి..

Vastu tips:  ఇంట్లో ఎలక్ట్రికల్​ వస్తువులు ఏ దిక్కున ఉండాలి..

ఇంటిని నిర్మించుకున్నా... కట్టిన ఇంటిని కొంటున్నా తప్పకుండా వాస్తు సిద్దాంతాలను పాటించాలని వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్​ అంటున్నారు.  అలా లేకుండా ఉన్న ఇంట్లో నివసిస్తున్న వారికి అనేక ఇబ్బందులు వస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఎలక్ట్రికల్​ వస్తువులు ఎక్కడ ఉండాలో తెలుసుకుందాం. . 

 ప్రశ్న:  ఇల్లు వాస్తుప్రకారం లేకపోతే... . దాని దుష్ప్రభావం వలన ..  అప్పుల్లో కూరుకుపోయి ఆర్ధిక ఇబ్బందులు వస్తాయి. చివరికి నాలుగేళ్ల క్రితం ఆ ఇంటిని అమ్మేశాం. అప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు మా అబ్బాయి మంచి ఉద్యోగంలో చేరాడు. లోన్ పెట్టి ఈమధ్యే మా పాత ఇల్లు దగ్గర్లోనే...  వాస్తు ప్రకారం నిర్మించిన ఇల్లు కొన్నాం. ఇంట్లో ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలు వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి.

జవాబు : వాస్తు దోషాలు ఎక్కువగా ఉండి, వాటిని సరిచేయకపోతే కచ్చితంగా ఆ ఇల్లు అమ్మి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. మీ పాత ఇల్లు కూడా ఆ కారణం వల్లే అమ్ముడుపోయినట్టుంది. కొత్త ఇల్లు వాస్తు ప్రకారం ఉందన్నారు. దానికి చాలా సంతోషం. రిఫ్రిజిరేటర్, ఎలక్ట్రిక్ రైస్ కుకర్, ఒవెన్, వాషింగ్ మెషీన్ వంటి విద్యుత్ గృహోపకరణాలను తూర్పు ఆగ్నేయం, పడమర వాయువ్యంలో పెట్టుకుంటే ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. ఇవి మాత్రమే కాదు... జనరేటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు వంటివి కూడా అక్కడ ఉంటేనే ప్రమాదాలకు తావు ఉండదు