దక్షిణాది వంటకాలలో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న వాటిలో సాంబార్ ఒకటి. తెలుగు వారి భోజనాలలో సాంబార్ కు ప్రత్యేక స్థానం ఉంది. సాంబార్ ఆవిష్కరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. దక్షిణ భారతదేశంలో తొలిసారి సాంబారు ఎక్కడ తయారు చేశారు.. ఎవరి కోసం .. ఎవరు తయారు చేశారు.. దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. .
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టపడి తినే సాంబార్ వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ వంటకం ఎండు మిరియాలు, పప్పు, చింతపండు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైన పదార్ధాలతో తయారు చేస్తారు. ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు,శంభాజీ తంజావూరును సందర్శించినప్పుడు, అతని కోసం ప్రత్యేకంగా సాంబార్ అనే వంటకాన్ని తొలిసారి వండినట్టు చెబుతారు. శంభాజీని ముద్దుగా సాంబా అని పిలుచుకుంటారు. ఈ కొత్త వంటకానికి అతని గౌరవార్థం అతని పేరునే పెట్టారు .షాజీ అనే రాజ వంటగాడు పప్పు వండుతున్నాడు. పప్పులో వేసేందుకు రేగిపళ్లు లేకపోవడంతో… చింతపండును వేశారు. అలాగే కొన్ని కూరగాయలు కూడావేశాడు. ఈ లోపు శివాజీ కొడుకు శంభాజీ పర్యటనకు అక్కడికి వచ్చాడు. ఆ వాసన అతనికి బాగా నచ్చింది. అతడికి ఈ సాంబారును తొలిసారి వడ్డించినట్టు చరిత్ర చెబుతోంది.
తంజావూరులో శంభాజీ ఆహారం
సాంబారును మొట్టమొదటిసారిగా ఎక్కడ తయారైంది అంటే... తంజావూరును పాలించిన మరాఠీ పాలకుల వంటశాలలో తయారుచేశారు. ఛత్రపతి శివాజీ సవతి తమ్ముడు వ్యాంకోజీ తంజావూరును పాలించారు. ఆయన 1683లో మరణించారు.వ్యాంకోజీ కుమారుడు షాహుజీ 1684లో సింహాసనాన్ని అధిష్టించారు. అప్పటికి ఆయనకు పన్నెండేళ్లు. ఆయనకు సాహిత్యం, కళలపై ఆసక్తి ఉండేది.ఆయన వంట చాలా బాగా చేసేవారని చెప్పేవారు.
ఛత్రపతి శివాజీ ఒకసారి తంజావూరు వెళ్లారు. సాధారణంగా ఆయన కోసం చేసే కూరల్లో రుచి కోసం వాడే రేగు పళ్లు లేకపోవడంతో చింతపండును వాడారు. సాధారణంగా కూరల్లో పులుపు కోసం కొన్ని ప్రాంతాల్లో రేగు పళ్ళు వాడతారు.ఆ రోజు శివాజీకి వండిన భోజనంలో రేగు పళ్లకు బదులు చింతపండు పులుపుతో వంటకాలు చేశారు.శంభాజీ మహారాజు గౌరవార్థం శంభాజీ + ఆహార్ అని కలిసివచ్చేలా ఆ వంటకానికి సాంబారు అని పేరు పెట్టారు. దక్షిణ భారతదేశంలో మాత్రమే కాకుండా భారతదేశమంతా ప్రాముఖ్యం పొందింది. శివాజీ మహారాజు తంజావూరు విచ్చేసినప్పుడు పప్పు తో చేసిన సాంబారును వడ్డించినట్లు ఆ వంటకానికి ఆయన గౌరవార్థమే ఆ పేరు పెట్టినట్లు తంజావూరు పాలకుల వారసుడు శివాజీ మహారాజ్ భోంసలే చెప్పారు.
దక్షిణాది వంటకం ...సాంబారు.... ఖ్యాతి దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా వ్యాపించింది. ఉడికించిన పప్పులో మునగ కాయలు, టమోటా, క్యారట్, గుమ్మడికాయ, కొత్తిమీర, చింతపండు పులుసు వేసి మరిగించి తాలింపు వేసి సాంబారు తయారుచేస్తారు. నిత్య జీవితంలో భాగమైపోయిన చాలా వంటకాల చరిత్రలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.సాంబారు పదంలో చాలా అర్థాలున్నాయి. ఇది మొదట్లో పదార్థాల రుచిని పెంచడానికి వాడేవారు. అయితే, ఇప్పుడు మనం చూస్తున్న సాంబారుకు ప్రాచీన కాలం నాటి అనేక వంటకాలకు సంబంధం లేదు.
సాంబారు అనే పదం ఎక్కడ నుంచి పుట్టింది?
20వ శతాబ్దపు మద్రాస్ నగరంలో ఉన్న చిన్న చిన్న ఆహార శాలల్లో కూళంబు అనే వంటకాన్ని వడ్డించేవారు. దానినే సాంబారు అని పిలిచేవారట.నెమ్మదిగా కుళంబు అంతరించి సాంబారు వాడుకలోకి వచ్చి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. "సాంబారును దక్షిణ భారతదేశంలో ఆహారం రుచిని పెంచేందుకు వాడే వంటకంగా వాడేవాడతారు. ఏది ఏమైనప్పటికీ మన జీవితంలో సాంబారుకో ప్రత్యేక స్థానం ఉంది. విదేశాల్లో ఉన్న దక్షిణాది హోటళ్లు కూడా ఈ సాంబారు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచడానికి ప్రధాన పాత్ర పోషించాయి. సాంబార్ తినడం వల్ల జీర్ణక్రియకు మంచిది. ఇంట్లోనే సులభంగా రుచికరమైన సాంబార్ తయారు చేసుకోవచ్చు. వారంలో ఒక్కసారైనా సాంబార్ చేసుకునేవారు ఎంతోమంది. కొందరైతే ప్రతిరోజూ వండుకుంటారు.