Vastu Tips : మన ఇంట్లోని బాత్రూం ఇక్కడ ఉంటే అన్ని విధాలా అరిష్టమే..!

Vastu Tips : మన ఇంట్లోని బాత్రూం ఇక్కడ ఉంటే అన్ని విధాలా అరిష్టమే..!

ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే జనాలు సిద్దాంతులు ..వాస్తు పండితులను సంప్రదిస్తున్నారు.   సొంత ఇల్లు అయినా... అద్దె ఇల్లు అయినా.. వాస్తు ప్రకారం లేకపోతే చికాకులు.. ఇబ్బందులు.. ఆర్ధిక సమస్యలు ఇలా అనేక సమస్యలు వస్తాయి.  అయితే ఇంట్లో బాత్రూమ్​ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే తరచూ ఆర్థిక సమస్యలు వేధిస్తాయని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాధుని శ్రీనివాస్​ అంటున్నారు.. మరి బాత్రూమ్​ ఎక్కడ నిర్మించుకోవాలో తెలుసుకుందాం. . .  

ప్రశ్న:  అద్దె ఇంట్లో రెండేళ్ల నుంచి ఉంటున్నాం.. మొదట్లో అప్పుడు బాగానే  ఉన్నా.. ఇప్పుడు చిన్నచిన్న ఆర్ధిక సమస్యలు వస్తున్నాయి. అయితే మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ బాత్రూమ్ నైరుతిలో ఉందేంటి? అక్కడ ఉండొద్దు కదా? అంటున్నారు. అది నిజమేనా? అందుకే మాకు ఇబ్బందులు వస్తున్నాయా? అసలు బాత్రూమ్ ఏ మూల ఉండాలి? 

జవాబు: బాత్రూమ్ ఎక్కడుండాలన్న విషయంలో ఎప్పుడూ సందేహాలు. ఉంటూనే ఉంటాయి. వాయువ్యం. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే మంచి జరుగుతుంది. నైరుతిలో గొయ్యి ఉండకూడదు. అందుకే బాత్రూమ్ ఆ మూల ఉంటే అన్ని రకాల సమస్యలూ వస్తాయి. మరోముఖ్యం విషయం, మెట్ల కింద మాత్రం బాత్రూమ్ ఉండొద్దు. కానీ చాలామంది ఫస్ట్ ఫ్లోర్​కు వెళ్లడానికి కట్టే మెట్ల కింద, జాగా కలిసొస్తుందని కడతారు. బాత్రూమ్​ లో గుంట, నీళ్లు ఉంటాయి.  కాబట్టి వాటిపై నుంచి నడవకూడదు. అది అన్నివిధాలా అరిష్టమేనని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ చెబుతున్నారు.