‘ఆకలి’ తీర్చొచ్చు!

ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రసంగించినప్పుడు… ప్రధాని నరేంద్ర మోడీ చిన్న కుటుంబాల అవసరాన్ని గుర్తు చేశారు. మనం ఒకపక్క అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నప్పటికీ అదే దామాషాలో జనాభాకూడా పెరుగుతూ వస్తోంది. ప్రజలకు పస్తులు లేకుండా చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సక్సెస్​ కావట్లేదు. పెరుగుతున్న జనాభాకి ఆకలి సమస్యను తీర్చడంలో ఇండియా వెనకబడింది. 117 దేశాల లిస్టులో 102వ ర్యాంక్​తో సరిపెట్టుకుంది. 2010లో 95వ స్థానం పొందగా గడచిన తొమ్మిదేళ్లలో 7 పాయింట్లు దిగజారిందని రీసెంట్​గా విడుదలైన గ్లోబల్​ హంగర్​ ఇండెక్స్​ (జీహెచ్​ఐ) తెలిపింది.

ఆరేళ్ల లోపు పిల్లల ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్​ కోసం కేంద్రం ఇంటిగ్రేటెడ్​ చైల్డ్​ డెవలప్​మెంట్​ స్కీం (ఐసీడీఎస్​)ని అమలు చేస్తోంది.

దేశంలోని అతి పెద్ద పబ్లిక్​ సర్వీస్​ ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి. అయితే ఈ స్కీం సగం మందికే అందుతోంది. అయితే, మన దేశంలో ఆకలి కేకలకు ఫుల్​ స్టాప్​ పెట్టడం పెద్ద కష్టం కాదని ఎక్స్​పర్ట్​లు అంటున్నారు. పల్లెల్లో పేదల కోసం ఫుడ్​​ సెక్యూరిటీ కార్యక్రమాలను పెద్దఎత్తున అమలవుతున్నాయి. ఇందులో భాగంగా బడి పిల్లలకు మిడ్​ డే మీల్స్, రేషన్​ షాపుల ద్వారా సరుకుల పంపిణీ, అంత్యోదయ అన్న యోజన వంటి పథకాలను సమర్ధవంతంగా చేపడుతోంది. 1996–2011 డేటా చూస్తే ‘గ్రీన్​ రెవెల్యూషన్’తో వడ్ల దిగుమతి (రైస్​ ఈల్డ్​) పెరిగింది. పేదలు పట్టెడన్నం తినగలుగుతున్నారు. వాళ్ల పిల్లలు వయసు, ఎత్తుకు తగ్గ బరువు పెరిగారు. ఈ ఫుడ్​ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్​​ని గిరిజనులు, దళితులకు పక్కాగా అందేలా చూడాలి.

సరైన సాగు విధానాలు, పర్యావరణానికి నష్టం చేయని ప్రకృతి వ్యవసాయం వంటి బేసిక్​ టూల్స్​తో దేశంలో ఆకలిని తరిమికొట్టొచ్చని మైక్రో ఇంటర్వెన్షన్​ ఎక్స్​పెరి​మెంట్లు నిరూపిస్తున్నాయి.

ఇలా చేస్తే చాలు..

  • కుటుంబ రాబడిని పెంచటం
  • తల్లిదండ్రులకు చదువు చెప్పే ‘సాక్షర భారత్’ లాంటి కార్యక్రమాలు
  • పారిశుద్ధ్యాన్ని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటం
  • భూకంపం, తుపాన్లు, వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల బారిన పడే బాధితు లకు హెల్త్​, న్యూట్రిషన్ విషయాల్లో ప్రభుత్వం​, ఇంటర్నేషనల్ గ్రూపులు మరింత సపోర్ట్​గా ఉండటం
  • వలసలను అడ్డుకోకుండా సామాజికం​గా,పొలిటికల్ గా నిర్ణయాలు తీసుకోవటం

జీహెచ్ ఐ లెక్కింపు ఇలా…

1 బలమైన తిండిలేక బాధపడేవారి శాతం

2 ఐదేళ్ల లోపు పిల్లలు వయసుకు తగ్గ బరువు లేకపోవటం

3 వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవటం

4 ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలు.

ఈ నాలుగు ఆధారంగా పాయింట్లు ఇస్తారు.ఐదేళ్ల లోపు బిడ్డల చావులు మన దగ్గర తక్కువే. ఈ విషయంలో ఇండియాకి మంచి మార్కులే పడ్డాయి. కానీ, వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. వంద మందిలో దాదాపు 21 మంది మాల్ న్యూ ట్రిషన్ బాధితు లే కావటం పెద్ద మైనస్ పాయింట్ .

Where the Global Hunger Index 2019 went wrong in India's case