OTT Thriller: ఓటీటీలోకి వంద కోట్ల తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Thriller: ఓటీటీలోకి వంద కోట్ల తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'తండేల్'(Thandel). ఫిబ్రవరి 7న పాన్ ఇండియా భాషల్లో రిలీజైన ఈ మూవీ వందకోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది.

ఈ మూవీ 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లతో, చైతన్య కెరీర్లోనే ల్యాండ్ మార్క్ సాధించింది. ఇండియాలో 12 రోజుల్లో రూ.60 కోట్ల నెట్ కలెక్షన్లు చేసింది.

Also Read :- ప్రేమ గొప్ప కాదు.. అది ఇచ్చే మనిషి గొప్ప

తండేల్ ఓటీటీ:

తండేల్ మూవీ నేడు (మార్చి 7న) ఓటీటీకి వచ్చేసింది. తాజాగా ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ & మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తండేల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఏకంగా రూ.40 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. నాగ చైతన్య కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ డీల్. అలాగే తండేల్ శాటిలైట్ రైట్స్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ సొంతం చేసుకుంది.

తండేల్ కథ:

తండేల్ మూవీ శ్రీకాకుళం మత్స్యకారుడు రాజు జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో రాజు-సత్యల మధ్య ఉన్న ప్రేమకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రాజు సముద్రంలోకి చేపల వేటకి వెళ్లడం, ఆ తర్వాత 22 మందితో కూడిన 3 బొట్లు పాకిస్థాన్ సరిహద్దుకు చేరడం, దాంతో అక్కడి పాకిస్థాన్ జైల్లో బంధించబడటం వంటి అంశాలు బాగా ఆసక్తిగా మారాయి. అక్కడి నుండి రాజు బయటపడి బుజ్జితల్లి ప్రేమను దక్కించున్నాడా లేదా అనేది ప్రధాన కథగా తండేల్ రూపొందింది.