
స్టార్ హీరో అజిత్, హీరోయిన్ త్రిష జంటగా నటించిన పట్టుదల ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడులైంది. తమిళంలో (విదాముయార్చి). మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మించింది.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో అజిత్ స్క్రీన్ ప్రజెన్స్, క్యారెక్టరైజేషన్ అదిరింది. ముఖ్యంగా ఈ సినిమాలో అజిత్కు యాక్షన్స్తో పాటు ఎమోషన్స్లో నటించే అవకాశం దొరికింది. భార్య దూరమైనపుడు పడే బాధ, ఆమె ప్రేమ కోసం పరితపించే సీన్స్‌లో ఆకట్టుకున్నాడు.
పట్టుదల కథ కోసం దర్శకుడు మగీజ్ తిరుమేని ఎక్కువగా కష్టపడలేదు. ఓ భార్య మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఛేదించే ఓ భర్త కథ ఇది. ఈ సింపుల్ పాయింట్ తీసుకుని తనదైన స్క్రీన్ ప్లే తో మ్యూజిక్ చేశాడు డైరెక్టర్.
పట్టుదల వసూళ్లు:
ఈ మూవీ ఫస్ట్ డే మంచి ఓపెనింగ్ రాబట్టింది. కానీ, ఈ సినిమాకు రాను రానూ మిక్సెడ్ టాక్ ఎక్కువ అవ్వడంతో అనుకున్నంతా వసూళ్లు రాబట్టలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.135.85 కోట్ల నెట్ వసూలు సాధించింది. ఇండియా నెట్ కలెక్షన్ రూ.80.35 కోట్లు.
Also Read :- ఇండియన్ సినిమాల్లో చూడని స్క్రిప్ట్ ఇది
ఇకపోతే, ఓవర్సీస్ లో రూ.40.15 కోట్లు, తమిళ వెర్షన్ రూ.78.54 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.2 కోట్లు వసూలు చేసింది. అయితే, ఈ సినిమా బాక్సాపీస్ వద్ద భారీ నష్టాలను ఎదుర్కొంది. దాంతో ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీకి వచ్చేసింది.
పట్టుదల ఓటీటీ:
యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భాషల్లో నేడు (మార్చి 3) నుంచి స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 1997 అమెరికన్ చిత్రం 'బ్రేక్‌డౌన్' ఆధారంగా రూపొందింది.
Raththam oru sottu michcham irundhaalum….. 🗣️🗣️🗣️Vidaamuyarchi.
— Netflix India South (@Netflix_INSouth) March 3, 2025
Watch Vidaamuyarchi, now on Netflix in Tamil, Hindi, Telugu, Kannada & Malayalam!#VidaamuyarchiOnNetflix pic.twitter.com/p0pVMD0Hmj
పట్టుదల కథ:
ప్రేమించి పెళ్లి చేసుకున్న రొమాంటిక్ కపుల్‌కి కొన్ని అనివార్య కారణాల వల్ల మనస్పర్థలు రావడంతో విడిపోవడానికి సిద్దపడతారు. వక్తులే వేరుగా ఉంటారు కానీ.. వాళ్ల మనసులు మాత్రం ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూనే ఉంటాయి. దీంతో ఈ జంట విడిపోవడానికి డిసైడ్ అవుతారు. కానీ, ఓ అనూహ్య సంఘటన వారిని మరింత దగ్గరయ్యేలా చేస్తుంది.
అంతలోనే భార్య కిడ్నాప్ కావడంతో ఆమెను రక్షించుకోవడానికి ఆ హీరో ఏం చేసాడు? అసలు వీరి మధ్య గొడవలు మొదలవ్వడానికి కారణాలేంటీ? ఒక్కటవ్వటానికి ఎదురైన సంఘటన ఏంటీ? అంతలోనే అతని భార్యను కిడ్నాప్ చేసేందేవరు? తిరిగి ఆమెను హీరో ఎలా రక్షించుకున్నాడు? అనేది పట్టుదల కథ.