కంగనా రనౌత్ (Kangana Ranaut) నటిస్తూ, తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ(Emergency). జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేకపోతుంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఇండియాలో రూ.11.39 కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సుమారు రూ.60కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఎమర్జెన్సీ మూవీకి బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశ తప్పేట్లు లేదు.
ఎమర్జెన్సీ ఓటీటీ:
ఇదిలా ఉంటే లేటెస్ట్గా ఎమర్జెన్సీ మూవీ ఓటీటీ వివరాలు బయటికి వచ్చాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక నెట్‌ఫ్లిక్స్ లో రీలిజ్ కానుందని మేకర్స్ తెలిపారు. సాధారణంగా హిందీ సినిమాలు థియేటర్స్కి వచ్చిన 7 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇస్తాయి. దీన్ని బట్టి చూస్తే ఎమర్జెన్సీ మూవీ మార్చిలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఎమర్జెన్సీ మూవీ మొదటి రోజున రూ.2.35 కోట్లు నెట్ వసూలు చేసింది. కంగనా రనౌత్ సోలోగా వచ్చిన గత సినిమాలతో పోలిస్తే ఎమర్జెన్సీకి వచ్చిన ఓపెనింగ్ అత్యధికంగా నిలిచింది. డైరెక్టర్గా కంగనా ఈ సినిమాను తెరకెక్కించిన విధానంపై మిక్సెడ్ టాక్ వచ్చింది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త ఇంపాక్ట్ చూపించాల్సి ఉందని కూడా ఆడియన్స్ నుంచి కామెంట్స్ వినిపించాయి. దాంతో రోజురోజుకు ఎమర్జెన్సీ బాక్సాఫీస్ తగ్గుతూ వస్తోంది. మరి ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
1975లో భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా కంగనా ఈ సినిమాని తెరకెక్కించింది. ఈ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించిన కంగనా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ జీ5 తో కలసి సంయుక్తంగా నిర్మించింది.