Malayalam Thriller: అఫీషియల్.. ఓటీటీకి మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్.. IMDB లో 9.1 రేటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Malayalam Thriller: అఫీషియల్.. ఓటీటీకి మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్.. IMDB లో 9.1 రేటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకి అదిరిపోయే సినిమా ఒకటి ఓటీటీకి రాబోతుంది. అందులోనూ మలయాళం నుంచి క్రైమ్, థ్రిల్లర్ జోనర్లో ఎంట్రీ ఇస్తుంది. క్రైమ్ జోనర్ను ఇష్టపడే వారికి ఈ సినిమా ది బెస్ట్ గా నిలవనుంది. ఎందుకంటే, IMDB లో 9.1 రేటింగ్ సంపాదించుకుంది. మరి ఆ లేటెస్ట్ మలయాళ థ్రిల్లర్ విశేషాలు ఏంటో చూద్దాం.

ప్రజేష్ సేన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మలయాళ థ్రిల్లర్ డ్రామా 'ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్' (The Secret of Women). జనవరి 31, 2025న థియేటర్లలోకి వచ్చింది. ఇందులో మలయాళ నటులు నిరంజ‌న అనూప్‌, అజు వ‌ర్గీస్‌, శ్రీకాంత్ ముర‌ళి కీల‌క పాత్ర‌లు పోషించారు.

ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్ ఓటీటీ: 

మలయాళ థ్రిల్లర్ డ్రామా 'ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్' రిలీజైన నెల రోజుల త‌ర్వాత ఓటీటీకి ఎంట్రీ ఇస్తోంది. తాజాగా (మార్చి 6న) ఈ విషయాన్ని స‌న్ నెక్స్ట్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించింది. 

ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్ కథ:

ఇద్ద‌రు మ‌హిళ‌ల జీవితాల్లో చోటుచేసుకున్న అనూహ్య ప‌రిణామాల‌తో డైరెక్టర్ ప్ర‌జేస్ సేన్ ఈ సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా పురుషాధిక్య‌తకు సంబంధించిన మెసేజ్‌ను థ్రిల్ల‌ర్ క‌థ‌లో జోడించి ఈ మూవీలో చూపించాడు డైరెక్ట‌ర్‌. దానికి తోడు అనుక్షణం ఉత్కంఠభరితమైన ఫీలింగ్ కలిగేలా కథను రాసుకుని సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఈ సినిమా మలయాళ ఆడియన్స్ కి ఎంతోగాను నచ్చింది. ఎందుకంటే, కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ప్రధాన పాత్రల చీకటి గత రహస్యాలు బయటపడతాయి.

ALSO READ | AnanyaPanday: మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అనన్య టాక్.. ధైర్యంగా ఎలా ఉండాలో తానే నేర్పింది

 ఇద్దరు మహిళలు చీకటి రహస్యాలను దాచిపెడుతూ.. ఒకరికొకరు తెలియకుండా అపరిచితుడితో తమ సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. అలా వారు ఎదుర్కొనే సవాళ్లు, అడ్డంకులను కళ్ళకు కట్టినట్లుగా చూపించింది ఈ మూవీ. దీనికి క్రైమ్, థ్రిల్లర్ అంశాలను జోడించి డైరెక్టర్ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే అల్లుకున్నాడు. ఇకపోతే, ఈ మూవీ విడుదలకు ముందే ప‌లు ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో స్క్రీనింగ్ అయ్యి, అవార్డులు గెలుచుకుంది.