Game Changer OTT: ఓటీటీలోకి రామ్ చరణ్ గేమ్‌ఛేంజ‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan) హీరోగా నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) మూవీ నేడు (జనవరి 10న) థియేటర్లలో రిలీజైంది. ఐదు భాష‌ల్లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్ షోతోనే పాజిటవ్ టాక్ తెచ్చుకుంది. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను ఐఏఎస్ అధికారి రామ్ నందన్ ఎదిరించే ప్రయత్నం చేయడమే సినిమా ప్రధాన కథగా తెరకెక్కింది.

వ్యవస్థను పీడిస్తున్న అవినీతి మరియు అక్రమాలను సవాలు చేస్తూ, న్యాయమైన ఎన్నికలను జరిపే లక్ష్యంతో పనిచేసే ఒక సాహసోపేతమైన IAS అధికారి కథను చెబుతున్నట్లు నెటిజన్స్ అంటున్నారు. సుమారు నాలుగేళ్ల పాటు తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అవ్వడం పక్కా అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలపై కూడా ప్రేక్షకులు ఓ కన్నేశారు.

గేమ్ ఛేంజర్ ఓటీటీ:  

దాదాపు రూ.500కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇది హిందీ మినహా అన్ని భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి అందుబాటులో ఉండనుంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఆరు వారాల త‌ర్వాత గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి రానున్న‌ట్లు స‌మాచారం. అయితే, సినిమా థియేటర్ రన్, బాక్సాపీస్ కలెక్షన్స్ ను బేస్ చేసుకుని సినిమా ఓటీటీ ఎంట్రీ ఉండనుంది.

ALSO READ : Game Changer X Review: గేమ్ ఛేంజ‌ర్ X రివ్యూ.. రామ్‌చ‌ర‌ణ్-శంక‌ర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?

జనవరి 8న అర్ధరాత్రి నుంచే గేమ్ ఛేంజర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనప్పటికీ హాట్ కేకుల్లా బుక్ అయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 లక్షలకి పైగా టికెట్లు అమ్ముడయినట్లు టాక్. ఫస్ట్ డే ఇండియాలో రూ.70-90 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే ఫస్ట్ డే తెలుగులోనే 4.8 లక్షల టికెట్లు అమ్ముడవడం విశేషం. ఇక హిందీలో 70 వేలకుపైగా, తమిళంలో 33 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి.