
రైటర్ ప్రసన్న కుమార్.. డైరెక్టర్ త్రినాథరావులది ఇంట్రెస్టింగ్ కాంబో. వీరిద్దరూ లేటెస్ట్గా మజాకా మూవీతో మరోసారి ఆడియాన్స్ ముందుకొచ్చారు. యంగ్ హీరో సందీప్ కిషన్ తో 'మజాకా' అంటూ ఫ్యామిలీ కామెడీతో వచ్చి ప్రేక్షకుల్లో హుషారు పెంచారు. మజాకా మూవీ బుధవారం (ఫిబ్రవరి 26) మహా శివరాత్రి సందర్భంగా రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
మజాకా వసూళ్లు & బ్రేక్ ఈవెన్:
ఈ మూవీ ఫస్ట్ డే (ఫిబ్రవరి 26న) తెలుగు థియేటర్లలో 25.36% ఆక్యుపెన్సీతో రూ.1.75 కోట్లు వసూలు చేసింది. అయితే, సందీప్ కిషన్ మునుపటి చిత్రం 'ఊరు పేరు భైరవకోన' మంచి ఓపెనింగ్‌ను సాధించింది. ఈ మూవీ ఫస్ట్ డే రూ.3.6 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.
ఈ సినిమాతో పోలిస్తే, 'మజాకా' స్లోగా బాక్సాఫీస్ ను షురూ చేసింది. కానీ, రాబోయే రోజుల్లో మజాకా మూవీ మెరుగైన ప్రదర్శనను కనబరిచే అవకాశం ఉంది. అందుకు కారణం లేకపోలేదు.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 650 స్క్రీన్‌లలో విడుదల కావడం విశేషం.
Also Read:-ఒకేసారి ఓటీటీ, టీవీల్లోకి 'సంక్రాంతికి వస్తున్నాం'..
అలాగే, ఈ సినిమాకు పోటీగా తెలుగు నుంచి ఎటువంటి పెద్ద సినిమాలేవీ లేకపోవడం మరింత ప్లస్ గా మారింది. ఇకపోతే ‘మజాకా’ మూవీకి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
మజాకా ఓటీటీ:
మజాకా మూవీ శివరాత్రి (ఫిబ్రవరి 26న) సందర్భంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. మజాకా సినిమా విడుదలకు ముందు ఆడియన్స్ నుంచి క్రేజీ టాక్ రావడంతో మంచి ధరకే ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు మజాకా థియేటర్లలో సక్సెస్ ఫుల్గా రన్ అవుతుండటంతో మార్చి లాస్ట్ వీక్లో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, థియేట్రికల్ రన్ను బట్టి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే రిలీజైన నాలుగు వారాల్లోపు వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు.