UI OTT Release: ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

UI OTT Release: ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘యూఐ ది మూవీ’.  రీష్మా నానయ్య హీరోయిన్.  నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి. రవిశంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.ఇపుడీ ఈ మూవీ థియేటర్స్ లో దూసుకెళ్తోంది.

రిలీజైన మూడ్రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఇండియాలో రూ.18 కోట్ల మేరకు నెట్ కలెక్షన్స్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే, ఈ మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్, స్ట్రీమింగ్ డేట్ వివరాలు బయటికి వచ్చాయి. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందనేది చూద్దాం. 

యూఐ ఓటీటీ:

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సన్ నెక్స్ట్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇందుకోసం మంచి ధరకే యూఐ మూవీని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ జనవరి లాస్ట్ వీక్ లో ఓటీటీ స్ట్రీస్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని టాక్. ఇకపోతే, ప్రస్తుత వీకెండ్ యూఐ వసూళ్ళని బట్టి స్ట్రీమింగ్ డేట్ ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా యూఐ ఓటీటీ విషయంలో మరో డిజిటల్ ప్లాట్‍ఫామ్ కూడా కన్నేసినట్లు టాక్. దీన్ని బట్టి ఉపేంద్ర యూఐ మూవీ ఒకే ఓటీటీలో రానుందా? ఒకేసారి రెండు ప్లాట్‍ఫామ్స్లో రానుందా అనేది తెలియాల్సి ఉంది.

ALSO READ | అల్లు అర్జున్ ప్రభుత్వాన్నిబద్నాం చేయాలనుకుండు: ఎంపీ చామల కిరణ్

కథేంటంటే:

సత్య(ఉపేంద్ర) మూవీ డైరెక్టర్ గా పని చేస్తుంటాడు. అయితే సత్యకి సమాజంలో జరుగుతున్న సంఘటనలకారణంగా అంతర్గత సంఘర్షణతో బాధ పడుతుంటాడు. ఈ క్రమంలో తానే యూఐ సినిమా తీసి రిలీజ్ చేస్తాడు. ఈ సినిమా మీరు ఇంటెలిజెంట్స్ అయితే ఇప్పుడే  సినిమా చూడకుండా బయటికెళ్ళవచ్చు, మీరు ఫూల్స్ అయితే ఫుల్ సినిమా చూడండి అంటూ టైటిల్ కార్డ్స్ తో ప్రారంభం అవుతుంది. అయితే సినీ విశ్లేషకుడు కిరణ్ ఆదర్శ్(మురళీ శర్మ) యూఐ సినిమా చూడటానికి వెళ్లి అర్థం కాక  రివ్యూ రాయడానికి ఇబ్బంది పడుతుంటాడు. దీంతో ఈ యూఐ సినిమా దర్శకుడు సత్య ని కలిసి మాట్లాడేందుకు వెళ్తాడు. ఈ క్రమంలో యూఐ సినిమా గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. అసలు ఈ సినిమాలో కల్కి భగవాన్ ఎవరు..? సత్య స్టోరీ ఏంటనేది తెలియాలంటే యూఐ సినిమా చూడాల్సిందే.