రోజుకో మలుపు తిరుగుతున్న యువకుడి శ్రీకాంత్ డెత్‌‌ మిస్టరీ

నిజామాబాద్, వెలుగు: బోధన్ యువకుడు శ్రీకాంత్ డెత్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. మిస్సింగ్‌‌‌‌ అయిన యువకుడు దాదాపు 80 రోజులకు డెడ్‌‌‌‌ బాడీగా దొరకడం.. అక్కడ లభించిన ఆధారాలతో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

చనిపోయి 62 రోజులైందా?

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 23  నుంచి కనిపించకుండా పోయిన శ్రీకాంత్‌‌‌‌ అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 12న శవమై కనిపించాడు. ఘటన స్థలంలో యువకుడి శరీరం కుళ్లిపోయి ఎముకలు తేలా యి. శవం కుళ్లిపోవడానికి కనీసం 30 రోజులు పడుతుందని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. అయితే చనిపోయిన శ్రీకాంత్‌‌‌‌ అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 10 వరకు సెల్‌‌‌‌ ఫోన్ చాటింగ్ కొనసాగినట్లు డెడ్‌‌‌‌ బాడీ వద్ద దొరికిన సెల్‌‌‌‌ ఆధారంగా తెలుస్తోంది. ఒక వేళ అదే రోజు అతడు చనిపోయినా డెడ్‌‌‌‌ బాడీ దొరికిన నాటికి 62 రోజులవుతుంది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 10 వరకు 18 రోజుల పాటు శ్రీకాంత్‌‌‌‌ ఎక్కడ ఉన్నాడు..? ఎవరి ఎవరితో మాట్లాడాడు.. చాటింగ్ చేశాడు..? అనేది మిస్టరీగానే ఉంది.

డిజిటిల్ ట్రేసింగ్‌‌‌‌తో...

మిస్సింగ్‌‌‌‌ అయిన శ్రీకాంత్ సెల్ ఫోన్ సిగ్నల్స్‌‌ను చివరి సారిగా నిలిచిపోయిన పసుపువాగు ప్రాంతాన్ని పోలీసులు డిజిటల్‌‌‌‌ ట్రేసింగ్‌‌‌‌తో గుర్తించారు. అక్కడ డెడ్ బాడీ ఆనవాళ్లు కనిపించలేదు. డ్రోన్ కెమెరాలతో అన్వేషించగా 30 ఫీట్ల ఎత్తులో ఉన్న చెట్టుపై వేలాడుతున్న తాడు కనిపించింది. అక్కడ పరిశీలించగా కుళ్లిన డెడ్‌‌‌‌ బాడీ పసుపు వాగులో దొరికింది. బోధన్, రుద్రూర్ రహదారికి కిలో మీటర్‌‌‌‌‌‌‌‌ సమీపంలో ఉన్న ఈ ప్రాంతం నుంచి నిత్యం రైతులు పొలాలకు వెళ్తుంటారు. 62 రోజులుగా తమకు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న మృతదేహం కనిపించలేదని స్థానికులు చెబుతు న్నారు. కుళ్లిన దుర్వాసన కూడా రాలేదంటున్నారు. ఘటనా స్థలి పరిసరాలు చూస్తే 30 ఫీట్ల చెట్టు ఎక్కేందుకు ఆధారం కూడా లేదు. ఇలా అంతుచిక్కని ప్రశ్నలు పోలీసులకు సవాల్‌‌‌‌ విసురుతున్నాయి.

పెళ్లికి ఒకే అని మెస్సేజ్‌‌..

అక్టోబర్ 10న శ్రీకాంత్‌‌ ఓ యువతితో చాటింగ్‌‌ చేసినట్లు తెలుస్తోంది. మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిసింది. పెళ్లి చేస్తామన్నారు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి విషయం మాట్లాడుతారు. నువ్వు ఇంటి రావాలి. అనేది ఆ మెస్సేజ్‌‌ సారాంశం. అయితే ఈ చాటింగ్‌‌లో నిశితంగా పరిశీలిస్తే యువతి ఫోన్‌‌తో మిస్సింగ్ అయిన యువకుడిని ట్రాప్ చేసినట్లు అర్ధమవుతోంది. అలా ట్రాప్‌‌ చేసి యువకుడిని హత్య చేశారా అనే అనుమానాలు రేక్కెత్తుతున్నాయి. ఒకవేళ యువతి కుటుంబ సభ్యుల బెది రింపులకు భయపడి శ్రీకాంత్‌‌ సూసైడ్‌‌ చేసుకుంటే నోట్‌‌ అయినా రాస్తాడు కదా అనేది బాధిత కుటుంబ సభ్యుల వాదన.