వేర్ యువర్ ఐస్ ఆన్.. ఆల్ ఐస్ ఆన్ రఫా" చిత్రంపై ఇజ్రాయెల్ కౌంటర్

న్యూఢిల్లీ:సెలబ్రిటీలు, క్రీడాకారులు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఇతర సోషల్ మీడియా వినియోగదారులు యుద్ధంలో దెబ్బతిన్న గాజాలోని దక్షిణ నగర మైన రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులపై 'ఆల్ ఐస్ ఆన్ రఫా' ఫొటోను షేర్ చేస్తున్నారు. హమాస్‌ను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో రఫాలోని శరణార్థి శిబిరం వద్ద చిన్నారులతో సహా కనీసం 45 మంది పౌరులు మరణించారు. ఈ సంఘటన అంతర్జాతీయ ఆగ్రహానికి కారణమైంది. గాజాలో యుద్ధంపై ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న ప్రపంచ ఒంటరితనాన్ని మరింత తీవ్రతరం చేసింది. 

ఇజ్రాయెల్ దీనిపై స్పందించింది. X లో షేర్ చేసిన పోస్ట్‌లో.. బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం అక్టోబర్ 7న మీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి" అనే టెక్స్ట్‌తో కూడిన చిత్రాన్ని షేర్ చేసింది. ఈ చిత్రంలో హమాస్ ఉగ్రవాది పసిపాప ముందు నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. 

అక్టోబర్ 7 దాడి ఫలితంగా ఇజ్రాయెల్‌లో 1,160 మంది మరణించారు. ఎక్కువగా పౌరులు. ఉగ్రవాదులు దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకుపోయారు. వీరిలో డజ న్ల కొద్ది మందిని నవంబర్ లో సంధి సమయంలో విడిచి పెట్టారు. ఉగ్రవాదుల చేతుల్లో ఇంకా 99 మంది బందీలుగా ఉన్నారు. వారిలో 31 మంది మరణించినట్లు అను మానిస్తోంది. 

మరో వైపు హమాస్‌ను నాశనం చేయడానికి ఇజ్రాయెల్ యొక్క ప్రతీకార సైనిక దాడిలో కనీసం 31,112 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల రఫా శరణార్థుల శిబిరంపై దాడుల్లో 45 మంది మృతిచెందారు వేల్లో గాయపడ్డారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలొ చ్చా యి. 

దీనిపై ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది. శిబిరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని దాడులు జరిగిందనడాన్ని ఖండించింది. హమాస్ ఆయుధాలు న్న స్థావరంపై రాకెట్ తాకడం వల్ల అగ్నిప్రమాదం వల్ల నష్టం జరిగిందని పేర్కొంది.

దాదాపు 45 మిలియన్ల మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో 'ఆల్ ఐస్ ఆన్ రఫా' వైరల్ అయిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ స్పందించింది. హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో అక్కడ నుండి పారిపోయిన లక్షలాది మంది పాలస్తీనియన్లు, పర్వతాలతో కప్పబడిన ఎడారిలో విస్తరించి ఉన్న గుడారాల వరుసలను చిత్రం చూపించింది. 

ఆల్ ఐస్ ఆన్ రఫా" చిత్రాన్ని పోస్ట్ చేసిన భారతీయ సెలబ్రిటీల్లో ప్రియాంక చోప్రా జోనాస్, అలియా భట్, కరీనా కపూర్, మాధురీ దీక్షిత్ నేనే, వరుణ్ ధావన్, సమంతా రూత్ ప్రభు ఉన్నారు.