
టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల పరంపర కొనసాగుతోంది.పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ప్రతినెలా తమ వర్క్ ఫోర్స్ను తగ్గించుకుంటున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెటా, HP , వర్క్ డే , HCL, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి అనేక టెక్, ఈకామర్స్ సంస్థలు లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా ఫిబ్రవరిలో 46 కంపెనీలు దాదాపు 16వేల ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 5641 ఉద్యోగులను తొలగించబడ్డారు. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో లేఆఫ్స్ భారీగా పెరిగాయి. ఫలితంగా ఉద్యోగుల సంఖ్యలో 184 శాతం తగ్గుదల కనిపిస్తోంది. అయితే పెద్ద పెద్ద కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటించడానికి గల కారణలేంటి?..
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ఫిబ్రవరిలో దాదాపు 3600మందిని తొలగించింది. HP 2వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మెటా,HP లకు మించి సేల్స్‌ఫోర్స్, వర్క్‌డే , ఆటోడెస్క్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులలో ఎక్కువమందికి పింక్ స్లిప్‌ను ఇచ్చాయి.
అయితే కంపెనీలు లేఆఫ్స్ ఎందుకు ప్రకటిస్తున్నాయి..? అంటే భారీ తొలగింపులకు దారితీసిన అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి. పెరుగుతున్న వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, ఆర్థిక వ్యవస్థలో ఒడుదుడుకులు అనిశ్చితి ఆందోళనలు వ్యాపారులను ఆలోచనలో పడేస్తున్నాయి. చాలా కంపెనీలు తమ ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటున్నాయి. దీంతోపాటు కోవిడ్ సమయంలో ఓవర్ హైరింగ్ వల్ల అనేక సంస్థలో సిబ్బంది అధికమయ్యింది.ఇప్పుడు ఆదాయాలు తగ్గుతున్న క్రమంలో ఉద్యోగులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.
మరో ప్రధాన అంశం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AIచాలా ఉద్యోగాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా కస్టమర్ సర్వీస్, HR, మార్కెటింగ్ వంటి ఉద్యోగాల్లో సిబ్బం ది అవసరం లేకుండా పోతోంది. దీంతోపాటు కొన్ని కంపెనీలు మెర్చింగ్, కంపెనీ ఆదాయాల్లో తగ్గుదల వంటి అంశాలు యాజమాన్యాన్ని పునరాలోచనలో పడేస్తోంది. కంపెనీలను లాభదాయకంగా కొనసాగించడానికి లేఆఫ్స్ ద్వారా ఖర్చులను తగ్గించుకునేలా చేసింది.
మరోవైపు ఏరోస్పేస్, ఫైనాన్స్,ఇంధన రంగాలలోనూ తొలగింపులు ఉన్నాయి. కొంచెం భిన్నమైన నమూనాను నివేదించింది. ఏరోస్పేస్ కంపెనీ అయిన లిలియం మొత్తం శ్రామిక శక్తిలో చాలా వరకు తగ్గించింది. 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. డిసెంబర్, 2025 ప్రారంభంలో ఆర్థిక సవాళ్లను అంచనా వేస్తూ ఉద్యోగుల తగ్గింపులను చేపట్టింది. పరిశ్రమ వ్యాప్త మార్పును సూచించింది.
ఉద్యోగుల తొలగింపులపై కొంతమంది విశ్లేషకులు అంచనాలు ఉద్యోగుల్లో కొంత ఊరట కలిగిస్తున్నాయి. 2025 మధ్య నాటికి ఉద్యోగుల తొలగింపు నెమ్మదిస్తుందని అంచనా వేశారు. కొంతమంది ఆర్థిక అనిశ్చితి కొనసాగితే మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండవచ్చని భావిస్తున్నారు. మారుతున్న వ్యాపార మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సూచిస్తున్నారు.