అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు: శిక్ష ఎన్నేళ్లు పడొచ్చు ?

అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు: శిక్ష ఎన్నేళ్లు పడొచ్చు ?

హీరో అల్లు అర్జున్ పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటితో పాటు 105 సెక్షన్‌ కింద నాన్‌బెయిలబుల్ కేసు కూడా నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. దీని ప్రకారం 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే విధంగా BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా  శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ ను తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

బట్టలు కూడా మార్చుకోనివ్వరా: పోలీసులపై అల్లు అర్జున్ అసహనం
అరెస్టు సమయంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద హైడ్రామ నడిచింది. ఇంట్లో ఉన్న అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పినా కూడా పోలీసులు వినకపోవడంతో.. అల్లు అర్జున్ అసహనానికి గురయ్యారు. నేను వస్తానని స్వయంగా పోలీస్ వాహనం ఎక్కారు. 

Also Read : భార్యను ఓదార్చి.. తండ్రికి ధైర్యం చెప్పి.. పోలీస్ స్టేషన్కు వెళ్లిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ తో పాటు వాహనం ఎక్కిన అల్లు అరవింద్:
అదే సమయంలో అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా పోలీసు వాహనం ఎక్కడంతో పోలీసులు అరవింద్ ను ఇంటి వద్దే వాహనం దింపేశారు. అరెస్టు సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, భార్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చి విచారణకు బయలు దేరారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన  పోలీసులు చిక్కడ పల్లి స్టేషన్ కు తరలించారు. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్నారు.