మన కంటే స్మార్ట్ ఫోన్ బానిసలు చాలా మందే ఉన్నారు.. మన ర్యాంకింగ్ 17 అంట.. మరి ఫస్ట్ ఎవరు..?

మన కంటే స్మార్ట్ ఫోన్ బానిసలు చాలా మందే ఉన్నారు.. మన ర్యాంకింగ్ 17 అంట.. మరి ఫస్ట్ ఎవరు..?

ఏరా ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటావ్.. ఏముందిరా ఆ ఫోన్ లో.. కొంచెంసేపు అయినా ఆ ఫోన్ పక్కన పెట్టు.. ఇలాంటి మాటలు ఇప్పుడు ప్రతి ఇంట్లో.. ప్రతి ఆఫీసులో వినిపించేవే.. ఇది ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ బానిసలు కోట్లలో పెరిగిపోతున్నారు. మన దేశంలోనే ఇలా ఉంటే.. మిగతా దేశాల్లో పరిస్థితి ఏంటీ అనే డౌట్ రావొచ్చు.. అవును.. ఆ లిస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. స్మార్ట్ ఫోన్ బానిసలు భారతదేశంలో కంటే మిగతా దేశాల్లోనే ఎక్కువగా ఉన్నారంట. స్మార్ట్ ఫోన్ కు బానిసలైన దేశాల లిస్టులో భారత్ 17వ స్థానంలో ఉందంట.. మనపైన ఉన్న మిగతా 16 దేశాల ఏంటో తెలుసుకుందామా..

స్మార్ట్ ఫోన్ బానిసల్లో మొదటి 20 దేశాలు వరసగా ఇలా ఉన్నాయి.

1. చైనా
2. సౌదీ అరేబియా
3. మలేషియా
4. బ్రెజిల్
5. సౌత్ కొరియా
6, ఇరాన్
7. కెనడా
8. టర్కీ
9. ఈజిప్ట్
10. నేపాల్
11. ఇటలీ
12. అస్ట్రేలియా
13. ఇజ్రాయిల్
14. సెర్బియా
15. జపాన్
16. ఇంగ్లాండ్ (యునైటెడ్ కింగ్ డమ్)
17. ఇండియా
18. అమెరికా
19. రొమేనియా
20. నైజీరియా

స్మార్ట్ ఫోన్ బానిసలుగా మారటానికి కారణాలు కూడా వెల్లడించింది మెక్ గిల్ యూనివర్సిటీ. మన పనులను ఈజీగా చేయటం ద్వారా అంటే.. మీరు ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, కేబుల్ బిల్లు.. ఫుడ్ బిల్లు, పెట్రోల్ బిల్లు.. ఇలాంటివి అన్నీ స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లించటం ద్వారా వాటికి మొదటగా బానిసలు అయ్యారంట.  ఆ తర్వాత ఆ స్మార్ట్ ఫోన్ లో వినోదం, ఆ తర్వాత కాలక్షేపం. ఆ తర్వాత ఆనందంతో కూడిన వ్యక్తిగత అవసరాలను తీర్చటం ద్వారా స్మార్ట్ ఫోన్ కు బానిసలు అయినట్లు ఆయా దేశాల్లో జరిగిన సర్వేలో స్పష్టం అయ్యింది.