ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి....తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!

ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి....తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!

అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు.   అంటే అన్నాన్ని దైవంతో భావించి తినేటటప్పుడు మొదటి ముద్ద కళ్లకు అద్దుకుని మరీ తింటాం.  అయితే  అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని విష్ణుపురాణంలో రుషి పుంగవులు పేర్కొన్నట్లు పండితులు చెపుతున్నారు. మరి భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. . . .

హైటెక్​ యుగంలో జనాలు  ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. పూర్వీకులు ఆచరించిన అలవాట్లు.. పద్దతులు .. నియమాలు పాటించడం లేదు. సరే ఏ విషయంలో ఎలా ఉన్నా తిండి విషయంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.  ఇప్పుడు ఏదో టేబుల్​ పై కూర్చొని తింటున్నామా.. ఆకలి చంపుకుంటున్నామా.. కడుపు నింపుకుంటున్నామా అనేలా యూత్​ ఆలోచిస్తుంది. కాని భోజనం చేసేందుకు కొన్ని పద్దతులు.. నియమాలు ఉన్నాయి.  

మనిషి మాటలు నేర్చి, వివేకవంతుడు, విజ్ఞానవంతుడు అయిన తర్వాత ఆహారం విలువ గుర్తించాడు.  ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది  ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోని వానికి ఏ కోరికలు ఉండవు అని చెబుతుంది భగవద్గీత. అందుకే పరబ్రహ్మ స్వరూపంగా భావించి అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు.


*  భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేస్తే ఆయుష్షు, ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి.  పడమర, దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదని వామనపురాణం, విష్ణుపురాణంలో ఉంది
* అన్నం తినేముందు కాళ్లు చేతులు కడుక్కోవాలి.
* భోజనం చేసిన తరువాత కూడా కచ్చితంగా కాళ్లు కడుక్కోవాలి.  లేదంటే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి
*  కాకులు ముట్టుకున్నదీ, కుక్కా, ఆవూ వాసన చూసిన భోజనం చేయకూడదు
*  పాలన్నం తిన్నాక పెరుగు అన్నం తినకూడదు
*  కాళ్ళు చాపుకుని, చెప్పులు వేసుకుని భోజనం చేయరాదు
*  భోజనం చేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు. నిల్వ ఉన్న, చల్లారిన ఆహారం తినకూడదు
*  10 నుంచి15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతం
*  నిలువ పచ్చడిని వయసులో  ఉన్నవారు 2 రోజులకోసారి, మధ్య వయసులో  వారానికి 2 సార్లూ, నలభై దాటాక తర్వాత 15 రోజులకోసారి, యాభై దాటాక నెలకొకసారి తీసుకోవటం ఆరోగ్యకరం
*  గ్రహణం రోజున అంటే సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు, చంద్రగ్రహణానికి  తొమ్మిది గంటల ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు
*  దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకూ పాలు తీసుకోకూడదు
*  భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటమూ  తగదు
*  అన్నాన్ని వృధా చేయరాదు, ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు
*  అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది 
*  ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి భుజించాలి
*  రోజుకు రెండుసార్లు భోజనం చేయాలి. ఈ  రెండుసార్లు మధ్యలో ఏ ఆహారం తీసుకోపోతే  ఉపవాస ఫలితం లభిస్తుందంటారు.
*  ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు
*  మఱ్రి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ, అరటి ఆకుల్లో భోజనం చేస్తే సంపద వృద్ధి చెందుతుంది
*  మోదుగ, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి.
* కంచాలు, ప్లేట్లలో తినే వారు  వాటిలో చేతులు కడుగరాదు.