బ్యాంకులు ఇటీవల కాలంలో ఫిక్సుడు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని సవరించాయి. చాలా బ్యాంకులు ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించారు. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ చెల్లిస్తుంది అనేది చూద్దాం...
బ్యాంక్ ఆఫ్ ఇండియా :
బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డిపాజిట్ స్కీం తీసుకొచ్చింది. ఫిక్సుడ్ డిపాజిట్లపై ఏడాది కాలానికి 7.30 శాతం వడ్డీ చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్స్ (60ఏళ్లు పైబడిన వారికి) 7.80 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది. సూపర్ సీనియర్స్.. అంటే 80 ఏళ్లు పైబడిన వారు డిపాజిట్ చేస్తే 7.95 శాతం వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్స్ 666 రోజుల కాలానికి.. 2 కోట్ల రూపాయల డిపాజిట్ పై 7.80 శాతం వడ్డీ ఇస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ వృష్టి పేరుతో కొత్త ఫిక్సుడ్ డిపాజిట్(FD) స్కీం తీసుకొచ్చింది. ఈ పథకం కింద 444 రోజుల కాలానికి డిపాజిట్ చేస్తే.. ఏడాదికి 7.25 శాతం వడ్డీ చెల్లిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా :
బ్యాంక్ ఆఫ్ బరోడా మాన్ సూన్ ధమాకా పేరుతో డిపాజిట్ స్కీం తీసుకొచ్చింది. 399 రోజుల కాలానికి ఫిక్సుడు డిపాజిట్ చేస్తే.. ఏడాదికి 7.25 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 333 రోజుల కాలానికి డిపాజిట్ చేస్తే 7.15 శాతం వడ్డీ ఇస్తుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ ఫిక్స్ డ్ డిపాజిట్స్ పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రకటించటం విశేషం.