హైద్రాబాద్, వెలుగు: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బంపర్ న్యూస్. ఒకేరోజు (11 నుంచి 13వ తేదీ వరకు) మూడు మెయిన్ బోర్డు ఐపీఓలు ఓపెన్ కావడంతో ఇన్వెస్టర్లలో జోష్ పెరిగింది. ఈ మూడింటిలో ఏది ఎక్కువ లాభం ఇవ్వనుందో ప్రయారిటీవైజ్ గా అప్లై చేస్తున్నారు రిటైల్ ఇన్వెస్టర్లు. మీరు కూడా అప్లై చేయాలనుకుంటే.. ఈ మూడు ఐపోవోలు ఎలా ఉన్నాయి, దేంట్లో లాభం ఉంటుందో.. మీకోసం ఈ షార్ట్ ఎనాలిసిస్. లేటెందుకు..ఇక చదివేయండి.
1. విశాల్ మెగామార్ట్:
మధ్యతరగతి ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు విశాల్ మెగామార్ట్. మిడిల్, బిలో మిడిల్ క్లాస్ కస్టమర్స్ ను దృష్టిలో ఉంచుకొని బిజినెస్ చేసే విశాల్ మెగామార్ట్ ఐపీఓ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. రూ.10 ఫేస్ వ్యాల్యూతో వస్తున్న ఈ ఐపీఓ ప్రైస్ రేంజ్ రూ.74 - -నుంచి రూ.78 గా ఫిక్స్ చేశారు. 13న (గురువారం) విశాల్ ఐపీఓ క్లోజ్ అవనుండగా, ప్రస్తుతం దీని గ్రే మార్కెట్ ప్రీమియం 25% ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18న విశాల్ మెగామార్ట్ మార్కెట్లో లిస్ట్ అవ్వనుంది. స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్, క్యాష్ బుక్ ఈ కంపెనీకి అడ్వాంటేజ్.
2.మొబిక్విక్:
ప్రస్తుతం ఉన్న ఐపీఓల్లో అత్యంత బజ్ క్రియేట్ చేస్తున్న ఐపీఓ మొబిక్విక్. ఆన్ లైన్ పేమెంట్ మార్కెట్స్ లో దూసుకుపోతున్న పేటీఎం ఇప్పటికే మార్కెట్ లో లిస్ట్ అవ్వగా.. దాదాపు అలాంటి బిజినెస్ చేస్తున్న మొబిక్విక్ ఐపీఓకి రావడం విశేషం. ఫైనాన్షియల్స్, బిజినెస్ లో అంత స్పీడ్ గ్రోత్ లేకపోయినా.. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, కంపెనీ గైడెన్స్ మదుపరులను ఆకర్షిస్తున్నాయి. ఇండియాలో ఆన్ లైన్ పేమెంట్ మార్కెట్ కు గ్రోత్ ఉండనుందనే అంచనాలతో పెద్ద పెద్ద క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఐపీఓ ప్రైస్ రేంజ్ రూ.265 నుంచి రూ.279 వరకు ఉంది. దాదాపు 50% ప్రీమియంతో గ్రే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
ALSO READ : రూ.5 వేల ఫైన్‌తో 31 లోపు ఐటీఆర్ ఫైలింగ్
3. సాయి లైఫ్ సైన్సెస్
ఫార్మా ఇండస్ట్రీలో సీఆర్డీఎమ్ఓ(CRDMO) బిజినెస్ చేస్తున్న ఈ హైద్రాబాద్ బేస్ డ్ కంపెనీ సుమారు రూ.3 వేల కోట్లను రైజ్ చేసేందుకు ఐపీఓగా వస్తోంది. ప్రైస్ బ్యాండ్ రూ.522- నుంచి రూ.549 వరకు ఉంది. స్ట్రాంగ్ బిజినెస్, క్యాష్ బుక్, రెవెన్యూ ఈ కంపెనీపై రిటైల్ ఇన్వెస్టర్లలో అంత ఆసక్తి కనబడకపోయినా, క్యూఐబీ నుంచి డిమాండ్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేమార్కెట్ లో ఈ కంపెనీ షేర్లకు సుమారు 6% డిమాండ్ ఉన్నట్లు అనధికారికంగా తెలుస్తోంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కు ఈ కంపెనీ బాగుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.