Good Health : మహిళలు స్నానానికి వేడి నీళ్లు మంచివా.. చల్లటి నీళ్లు మంచివా..

Good Health : మహిళలు స్నానానికి వేడి నీళ్లు మంచివా.. చల్లటి నీళ్లు మంచివా..

గర్భవతులు ఈ వేడినీళ్ల  స్నానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  మామూలు రోజుల్లో చేసినట్లు ఆ టైమ్​ లో  కూడా మసులుతున్న నీళ్లతో స్నానం చేయాలనుకుంటే పొరపాటు...  అయితే... వేడివేడి నీళ్లతో స్నానం చేయుచ్చా.. ? గోరు వెచ్చని నీళ్లతోనే  చేయాలా...  కేవలం చల్లటి నీళ్లతోనే చేయాలా? అనే విషయంలో చాలామం దికి అనేక సందేహాలు, అనుమానాలు ఉంటాయి వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే దాని గురించి తెలుసుకోవాల్సిందే. . . .


ఆఫీసులో లేదా బయట రోజంతా పని చేసి అలసిపోతారు. రాత్రయ్యేసరికి ఒళ్లంతా నొప్పులతో ఇంటికి డీలా పడుతూ వస్తారు. అలాంటప్పుడు ఎంతరాతైనా సరే, కాసిన్ని వేడినీళ్లతో స్నానం చేస్తే బాగుంటుందని, వేడినీళ్లస్నానం చేస్తారు. అప్పుడు హాయిగా నిద్రపడుతుంది. అలాగే ఇంకొందరు అలసటగా ఉన్నా లేకున్నా రోజూ వేడినీళ్ల స్నానం చేసి ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ ఫార్ములా అందరికీ వర్తించదు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్లు చన్నీళ్లతోనే స్నానం చేయాలంటున్నారు వైద్య నిపుణులు.  

అసలు నిజం ఏమిటి..

పాతకలం నుంచి పెద్దలు చెప్పే మాట ఒక్కటే.  ఆరోగ్యంగా ప్రసవం కావాలంటే వేడి నీళ్ల స్నానానికి దూరంగా ఉండాలి,  అయితే అది పూర్తిగా  
నిజం కాదంటున్నారు నిపుణులు. వేడి నీళ్ల స్నానం చేయవచ్చు .  కాని మరీ ఒళ్లు కాలేంత కాకుండా  గోరువెచ్చని నీళ్లను వాడాలి. అలా కాకుండా ఒళ్లు కాలే నీళ్లతో చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.

వేడి నీళ్లతో సమస్యలు...

  • మసులుతున్న నీళ్లతో స్నానం చేసినప్పుడు.. గర్భిణులకు బీపీ పడిపోతుంది. దాంతో బిడ్డలకు ఆక్సిజన్, న్యూట్రియంట్స్ సరిగా అందవు. ఆ సమస్య తీవ్రమైనప్పుడు అవార్డన్ అయ్యే అవకా శాలు ఎక్కువగా ఉంటాయి. 
  •  మొదటి ట్రైమిస్టర్లో వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల... పిల్లల్లో స్పైన బిఫిడా' అనే నరాల సంబంధిత లోపాలు రావొచ్చని ఎన్నో స్టడీస్​ చెప్పాయి. 
  •  వేడినీళ్లతో స్నానం పూర్తవ్వగానే గర్భవతులు బాగా అలసిపోయి వీటి అవుతారు. హైపర్డియా" అనే సమస్యతో బాధపడాలి వస్తుంది. అంటే శరీరం విడుదల చేసేదాని కన్నా.. లోపలికి గ్రహించే వేడి ఎక్కువగా ఉంటుంది..

అందుకే వద్దు..!

పైన చెప్పిన సమస్యలు వస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు వేడి నీళ్ల జోలికి వెళ్లోర్టు. అందుకే బాగా కాలుతున్న నీళ్లు, హాట్ టబ్, స్టీమ్ టబ్ వంటివి సురక్షితం కాదంటారు దాక్టర్లు కచ్చితం గా వేడి నీళ్లే కావాలి. చల్లటి నీళ్లతో చేయలేమను కుంటే చాలా తక్కువ సమయం మాక్సిమమ్ రెండు నిమిషాలు) హాట్ షవర్ కింద ఉండొచ్చు.


హాట్ టబ్ తో జాగ్రత్త!

అది హాట్ బాత్, హాట్ టచ్​బాత్​, హాట్ పవర్​బాత్​  అయినా... నీళ్లు గోరువెచ్చగా ఉండాలి. ముఖ్యంగా బాత్ ఉన్నప్పుడు విపరీతంగా చెమట పట్టినా, చర్మం ఎర్రగా మారినా... వెంటనే టబ్​ లో నుంచి బయటికి రావాలి. వెంటనే వేడినీళ్లలో చల్లటి నీళ్లు కలపాలి. లేదా కూల్ వాటర్ ట్యాప్ ఓపెన్ చేసి, వేడి నీళ్లను చల్లార్చాలి. 

మరో ముఖ్యవిషయం. గర్భవతులు స్నానం చేస్తున్న టబ్​ లో పెంటెడ్ అయిల్స్, సాల్ట్స్​లాంటివి కలపొద్దు, అలా చేస్తే వెజైనా అసిడిక్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండదు. అది ఈస్ట్ ఇన్ఫెక్షన్కు దారి తీయొచ్చు. డెలివరీ టైమ్ లో తల్లికి ఇలాంటి ఇన్ ఫెక్షన్లు ఉంటే, అవి పుట్టే బిడ్డకూ వచ్చే అవకాశాలు ఉంటాయి. హాట్ టబ్​లో  టెంపరేచర్ చాలా తక్కువగా ఉండాలి. అలాగే అందులో స్నానం చేసే టైమ్ కూడా పది నిమిషాల లోపే ఉండాలి. టబ్​లో వేడి నీళ్లను నింపాక, అందులో థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చెక్​ చేయాలి. . .