Good Health : ఇది చక్కెర లాంటి కృత్రిమ చక్కెర.. ఆరోగ్యం అని ఎక్కువ వాడితే అనారోగ్యం తెలుసా..!

Good Health : ఇది చక్కెర లాంటి కృత్రిమ చక్కెర.. ఆరోగ్యం అని ఎక్కువ వాడితే అనారోగ్యం తెలుసా..!

రోజుకు రెండు, మూడు కప్పుల కాఫీ తాగనిదే పొద్దుపోదు చాలామందికి...  ఒకప్పుడు చాయ్, కాఫీ... ఇలా ఎందులో నైనా చక్కెర వేసుకుని తాగేవాళ్లు. కానీ చక్కెరలో క్యాలరీలు ఎక్కువగా ఉంటున్నాయని... ఇప్పుడు చాలామంది చక్కెరకు బదులుగా సుక్రలోజ్ (కృత్రిమ చక్కెర) వాడుతున్నారు. ఇందులో ఎలాగూ క్యాలరీలు ఉండవని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాడుతున్న ఈ కృత్రిమ చక్కెర.. మేలు చేయడం సంగతి పక్కన పెడితే కీడు చేస్తుందని అంటున్నారు న్యూట్రిషనిస్ట్లు.

కొంతమంది  చక్కెరను పూర్తిగా  వాడటం పూర్తిగా మానేశారు. చాయ్, కాఫీ... ఎందులోకైనా సుక్రలోజ్​ నే  వాడుతున్నారు. అందులో ఎలాంటి క్యాలరీలు ఉండవు. అందుకే చక్కెరకు బదులుగా ఇవి వాడుతున్నారని చెబుతున్నారు.  ఇంట్లో తాగే  సుక్రలోజ్ కాఫీ.. టీ కంటే ​ రెస్టారెంట్స్ లో కాఫీలతో పాటు ఇచ్చే సుక్రలోజ్ చాలా ఇష్టంగా.. రుచిగా ఉంటుంది.

Also Read :- చలికాలంలో దోమలు వేధిస్తున్నాయా.. ఇంటి చిట్కాలతో ఇలా తరిమేయండి

ఇది షుగర్ కాదు కాబట్టి రెండు, మూడు ప్యాకెట్లు వేసుకుని కాఫీ తాగుతుంటారు. ఈ మధ్య ఇంట్లో వండే స్వీట్స్​లో కూడా ఇదే వాడుతున్నారు. సుక్రలోజ్​ కాకుండా  చక్కెర వాడితే  శరీరంలో క్యాలరీలు పెరిగి లావు అవుతారన్న భావన అందరికీ ఉంది. కానీ ఈ సుత్రలోజ్ బరువు తగ్గించకపోగా.. రకరకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సుక్రలోజ్ అంటే...

కృత్రిమంగా తయారు చేసిన చక్కెరనే సుర్రలోజ్ అంటారు. ఇది చక్కెరలా కనిపించడమే కాదు.. రుచిలోనూ తియ్యగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని రకరకాల రసాయనాలతో తయారు చేస్తారు. అందువల్లే వీటిని ఎక్కువగా వాడొద్దంటున్నారు డాక్టర్లు. ఈ సుక్రలోజ్ వల్ల కడుపునొప్పి, తల తిరగడం, కండరాలు పట్టేయడం, వాపులు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఆకలి పెరుగుతుంది..

అది మామూలు చక్కెర అయినా... కృత్రిమంగా తయారు చేసిన సుక్రలోజ్ అయినా.. రుచి మాత్రం తీపేకదా. దాంతో ఇవి కూడా ఆకలిని పెంచుతాయి. రెగ్యులర్​ గా  సుక్రలోజ్ తినేవాళ్లు కచ్చితంగా బరువు పెరుగుతారు. 30 ఏళ్లుగా ఈ కృత్రిమ చక్కెరను తింటున్న వాళ్లు అధిక బరువుతో బాధపడుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి.

మోతాదు తగ్గించాలి

ఈ సుక్రలోజ్ కి అలవాటు పడిన వారు.. వీటిని వెంటనే మానేయలేరు. అందుకే మోతాదును కొద్దికొద్దిగా తగ్గించుకుంటే.. కొన్నిరోజులకు పూర్తిగా మానేయొచ్చు. అయితే తగ్గించే క్రమంలో తలనొప్పి, అతిగా ఆకలి, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు ఎదురయ్యే అవకాశం ఉంది.. వాటిని లెక్కచేయకుండా మానేస్తే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు స్యూట్రిషనిస్ట్లు.

–వెలుగు, లైఫ్​–