అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ( నవంబర్ 5, 2024 ) జరగనున్న ఈ ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే ముందస్తు ఓట్లు వేస్తున్నారు అమెరికన్లు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలట్ పేపర్లో భారతీయ భాష ఉందని వినిపిస్తున్న వార్త ఆసక్తరంగా మారింది. ఇంతకీ అమెరికా బ్యాలెట్ పేపర్లో ఉన్న ఆ భారతీయ భాష ఏది, అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read :- చైనాలో 10 లక్షలు తగ్గిన వివాహాలు.. పెళ్లెత్తితే చాలు చిరాకులు
అసలు విషయం ఏంటంటే.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 200కు పైగా భాషలు మాట్లాడే జనాభా ఉంటుంది. ఆంగ్లేతర భాషలు మాట్లాడే అమెరికా పౌరుల సౌలభ్యం కోసం ఇంగ్లీష్ సహా నాలుగు అదనపు భాషల్లో బ్యాలెట్ పేపర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇంగ్లీష్ తో పాటు ఉన్న నాలుగు అదనపు భాషల్లో మన బెంగాలీ భాష కూడా ఉంది. ఈ మేరకు న్యూయార్క్ సిటీ బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై బెంగాలీ మాట్లాడే అమెరికా పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.