వడదెబ్బతో ఎంఈవో మృతి

వడదెబ్బతో ఎంఈవో మృతి

కరీంనగర్:రాష్ట్రంలో ఎండతీవ్రత , వడగాల్పులతో వడదెబ్బతో ఎంఈవో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా  చొప్పదండిలో జరిగింది. జిల్లాలోని వెల్గటూర్, ధర్మపు రి,  బుగ్గారం, ఎండపల్లి మండలాల ఎంఈవోగా , పలు గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న బత్తుల భూమయ్య వడదెబ్బ తగలడంతో శనివా రం తెల్లవారు జామున మృతిచెందారు. గత కొంత కాలంగా భూమయ్య ఎండపల్లి జెడ్పీ హైస్కూ్ హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి దాకా పది పదకొండు జిల్లాల్లోనే 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఏకంగా 18 జిల్లాల్లో ఆ స్థాయి టెంపరేచర్లు రికార్డయ్యాయి. 40కి పైగా మండలాల్లో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మునగాల (సూర్యాపేట), పమ్మి (ఖమ్మం), నేరెళ్ల (జగిత్యాల)లలో 46.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

మంథని (పెద్దపల్లి)లో 46.7, కామారెడ్డిగూడెం (నల్గొండ)లో 46.6, హాజీపూర్​ (మంచిర్యాల)లో 46.6, ముత్తారం (పెద్దపల్లి)లో 46.5, మామిళ్లగూడెం (సూర్యాపేట)లో 46.5, మట్టంపల్లి (సూర్యాపేట)లో 46.5, ఇబ్రహీంపేట (నల్గొండ)లో 46.5 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. 11 జిల్లాల్లో 45 నుంచి 45.9 మధ్య, 4 జిల్లాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం పాటు టెంపరేచర్లు ఇదే స్థాయిలో ఉంటాయని వీక్లీ బులెటిన్​లో ఐఎండీ హెచ్చరించింది. 

46 డిగ్రీలకు పైగా

కరీంనగర్ (వీణవంక) 46.5, మహబూబాబాద్ (కొమ్ములవంచ) 46.4, నారాయణపేట (ఊట్కూరు) 46.4, జయశంకర్​ భూపాలపల్లి (చేల్పూరు) 46.3, వరంగల్​ (గొర్రెకుంట) 46.3, ములుగు (మల్లూరు) 46.2, జనగామ (జాఫర్​గఢ్​) 46.1, వనపర్తి (కేతేపల్లి) 46.1, హనుమకొండ (కాజీపేట) 46, భద్రాద్రి కొత్తగూడెం (భద్రాచలం) 46, నాగర్​కర్నూల్ (కల్వకుర్తి) 46, జోగులాంబ గద్వాల (వడ్డేపల్లి) 46 డిగ్రీలు నమోదయ్యాయి.