
వాస్తు నిపుణులు చెబుతున్న ఈ వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఏ సమస్య లేకుండా హాయిగా ఉండడానికి వీలు అవుతుంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో కూడా పూజ గదిని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు
ఇంటి నిర్మాణంలో ప్రతిదానికి వాస్తు పద్దతులు ఉంటాయి. ఆ సిద్దాంతం ప్రకారమే కిచెన్.. బెడ్ రూం.. పూజా మందిరం.. ఇలా అన్ని నిర్మిచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే దాదాపు హిందూ కుటుంబానికి చెందిన ఇళ్లలో కచ్చితంగా తులసి మొక్క ఉంటుంది. అయితే తులసి మొక్క కూడా ఇంట్లో వాస్తు ప్రకారం ఏ దిక్కున ఉండాలి.. వాస్తు పండితులు కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం. .
ప్రశ్న: ఉత్తర దిక్కు ప్రధాన ద్వారం .. దక్షిణ దిక్కు మరో ద్వారం ఉంటే.. అలాంటి ఇళ్లలో ప్రధాన ద్వారం ఎదురుగా కాకుండా, మరో ద్వారం ఎదురుగా తుల సికోట పెట్టుకోవచ్చా?
జవాబు: ఉత్తర దిక్కు లేదా తూర్పు దిక్కు తులసి కోట కట్టుకుంటే మంచిది. ఈ రెండు దిక్కులూ వీలుకానప్పుడు దక్షిణ దిక్కులో తులసికోట పెట్టుకోవచ్చని వాస్తు పండితులు కాశీనాథుని శ్రీనివాస్ గారు చెబుతున్నారు.