
భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. కొన్ని ప్రాంతాల ప్రజలు వేడితో ఇబ్బంది పడితే.. మరికొన్ని ప్రాంతాల్లో ఏడాదంతా చలి ఉంటుంది. సూర్యుడు ఉదయం ఒకప్రాంతంలో ఉదయిస్తే... సాయంత్రం మరో చోట అస్తమిస్తాడు. సూర్యాస్తమయం చివరిసారిగా ఎక్కడ జరుతుందో తెలుసుకుందాం. . .
ప్రపంచంలో ఒక ప్రాంతంలో సూర్యుడు ఉదయిస్తే..మరోప్రాంతంలో అస్తమిస్తాడు. భారతదేశంలో అనేక మతాలు.. ఎన్నో కులాలు.. చాలా రకాల ప్రజలు నివసిస్తుంటారు. భిన్నత్వంలో ఏకత్వంగల దేశం భారతదేశం. అంతే కాదండోయ్.. ప్రకృతి కూడా అలానే ఉంటుంది. ఓ ప్రాంతంలో వేడిగా.. మరో ప్రాంతంలో చల్లగా... ఇంకో ప్రాంతంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఇదంతా సూర్యుడు ఉదయించే.. అస్తమించే సమయాలను బట్టి ఉంటుంది.
భారతదేశంలో చివరిసారిగా సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుజరాత్ లోని గుహార్ మోతీలో చివరి సారిగా సూర్యాస్తమయం జరుగుతుంది. గుజరాత్ భారతదేశానికి పశ్చిమ దిక్కున ఉంది. ఇక్కడ జూన్ నెలలో సూర్యుడు రాత్రి 7.39 గంటలకు అస్తమిస్తాడు. ఇక సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడనే విషయానికొస్తే... అరుణాచల్ ప్రదేశ్.. అరుణ్ అంటే సూర్యుడు.. చల్ అంటే ఉదయించడం అని అర్దం. డాంగ్ వ్యాలీ ప్రాంతంలో సూర్యోదయం ఉదయం 5 గంటలకు సంభవిస్తుంది. జూన్ నెలలో అయితే ఉదయం 4.30 గంటలకే సూర్యోదయం జరుగుతుంది.