అక్షయ తృతీయరోజున ఏరాశి వారు బంగారం కొనాలి.. ఏ రాశి వారు వెండి కొనాలి...

అక్షయ తృతీయరోజున  ఏరాశి వారు బంగారం  కొనాలి.. ఏ రాశి వారు వెండి కొనాలి...

 అక్షయ తృతీయ 2025:  అక్షయ తృతీయ   ఏప్రిల్ 30, బుధవారం... హిందూ మతం ప్రకారం, ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం మరియు కొనడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొనుగోలు చేసిన బంగారు వస్తువులు ఎప్పుడూ తగ్గవు ...  ఎల్లప్పుడూ పెరుగుతాయని నమ్ముతారు.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఏ  రాశివారు  ఏమి కొని దానం చేయాలో తెలుసుకుందాం. . 

మేషరాశి: బంగారు ఉంగరం కొనుక్కొని..  బార్లీ, ధాన్యాలు దానం చేయండి.
వృషభ రాశి: వెండి నాణేలు ..  పాదరక్షలు కొనడం చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారు  పండ్లను  దానం చేయండి.
మిథున రాశి: పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రాశి వారు బంగారు గొలుసు ..  చెవిపోగులు...   వెండి ఆభరణాలు కొంటే శుభ ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు.   11 మంది బ్రాహ్మణులకు ఆకుపచ్చ కూరగాయలు ..  పండ్లను  దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
కర్కాటక రాశి: వెండితో చేసిన  వస్తువులు కొంటే మంచిది.  ఈ రాశి వారు పేదలకు   కొత్త బట్టలు ..  దానిమ్మ  పండ్లు దానం చేయాలి.
సింహ రాశి: బంగారు లాకెట్ ..  గొలుసు కొనండి ..  బ్రాహ్మణులకు  స్వయం పాకం ఇవ్వండి.   పేదవారికి  అన్నదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. 
కన్యారాశి: బంగారు గాజులు..  ముక్కుపుడక .. ఉంగరం కొనండి .  దగ్గరలోని దేవాలయానికి వెళ్లి స్వామి వారికి పండ్లను సమర్పించండి.  దేవాలయ పూజారికి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి.
తులా రాశి: వెండి పాదరక్షలు కొనండి.  పిండి, పాలు, పెరుగు వంటి తెల్లటి వస్తువులు దానం చేయండి.
వృశ్చిక రాశి : బంగారు ముక్కుపుడక...  ఉంగరం కొనండి.    రాగి పాత్ర కొనడం ...  స్వీట్లు దానం చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు  బంగారు గొలుసు కొనుగోలు చేయాలి.  పేదలకు  పండ్లు దానం చేయడం వలన అంతా మంచే జరుగుతుంది. 
మకరం ..  కుంభ రాశి:  ఈ రెండు రాశుల వారు ఫర్నిచర్‌తో పాటు బంగారం ... వెండి ..ఆభరణాలుకొనాలి. కాళ్ళకు సంబంధించిన వస్తువులను కొనడం శుభప్రదం. బ్రాహ్మణుడికి మిఠాయిలు ....పప్పు దానం చేయండి.
మీనం: బంగారు  గాజులు, నెక్లెస్ .. వెండితో తయారుచేసిన  చెవిపోగులు వంటి  ఆభరణాలను కొనండి. ఈ రాశి వారు  పసుపు రంగు స్వీట్లను దానం చేయండి.

►ALSO READ | ఏప్రిల్​ 30న అక్షయ తృతీయ.. బంగారం కొనేందుకు శుభ ముహూర్తం ఇదే..!