ఎమ్మెల్యే జోగు రామన్నను అడ్డుకున్న యాదవ సంఘం నేతలు

  • గొర్ల యూనిట్లు మంజూరు కాలేదని నిలదీత

జైనథ్, వెలుగు: ఆదిలాబాద్ ​ఎమ్మెల్యే జోగు రామన్నకు ప్రజల నుంచి మరోసారి నిరసన ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జైనథ్ మండలంలోని అడ గ్రామానికి వెళ్తుండగా.. గమ గ్రామంలోకి రానివ్వకుండా  గ్రామస్తులైన యాదవ సభ్యులు ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. గతంలో 58 గొర్రెల యూనిట్ల కోసం ఒక్కొక్కరం రూ. 43,750  డీడీలు కట్టామని కానీ 28 మందికి మాత్రమే లోన్ వచ్చిందని, మిగతా వారికి ఇప్పటివరకు మంజూరు చేయలేదని మండిపడ్డారు.

పలుమార్లు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చినా నిర్లక్ష్యం చేసి పట్టించుకోలేదని ఫైర్​అయ్యారు. దీంతో బీఆర్​ఎస్ నాయకులు, యాదవ సంఘం సభ్యుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు కలగజేసుకొని వారిని చెదరగొట్టారు. దీంతో ప్రచారం చేయకుండానే ఎమ్మెల్యే జోగు రామన్న అక్కడి నుంచి వెనుదిరిగారు.