టాటా టెక్ షేర్లయితే కొనను! : సంజీవ్‌‌‌‌ భాసిన్‌‌‌‌

న్యూఢిల్లీ: టాటా టెక్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లందరూ ఎగబడుతుంటే  ఐఐఎఫ్‌‌‌‌ఎల్ సెక్యూరిటీస్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సంజీవ్ భాసిన్ మాత్రం ఈ షేరుపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ‘టాటా టెక్ షేర్లు భారీ ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి. కానీ,  టాటా ఎలెక్సీ, ఇతర టాటా గ్రూప్ కంపెనీల షేర్లు ఇంకా తక్కువ రేటుకు ట్రేడవుతున్నాయి. వీటి ట్రాక్ రికార్డ్ కూడా బాగుంది.

టాటా టెక్‌‌‌‌ కంటే ఇవి బెటర్‌‌‌‌‌‌‌‌’ అని సంజీవ్ భాసిన్ వెల్లడించారు.  హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌, ఐఓసీ, బీపీసీఎల్‌‌‌‌ వంటి ప్రభుత్వ కంపెనీల షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ కంపెనీల షేర్లపై ఓ లుక్ వేయాలని, లేదా సీపీఎస్‌‌‌‌ఈ ఈటీఎఫ్‌‌‌‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చని సలహా ఇచ్చారు. లార్జ్ క్యాప్ షేర్లలో హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్‌‌‌‌ను ఆయన రికమండ్ చేశారు. ఈ షేరు రూ.1,500 లెవెల్‌‌‌‌ వైపు కదులుతోందని చెప్పారు.  

పెరిసిస్టెంట్‌‌‌‌, కోఫోర్జ్‌‌‌‌ షేర్లు పడినప్పుడు కొనుగోలు చేస్తానని అన్నారు. బ్రాడ్ మార్కెట్‌‌‌‌లో బోలెడు అవకాశాలు ఉన్నాయని, పీఎస్‌‌‌‌యూలు, పవర్‌‌‌‌‌‌‌‌, రైల్వే కంపెనీల్లో మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. లార్జ్ క్యాప్‌‌‌‌లో కోటక్‌‌‌‌, ఎస్‌‌‌‌బీఐ, హెచ్‌‌‌‌సీఎల్ టెక్ షేర్లలో తన డబ్బులు పెడతానని పేర్కొన్నారు.  కొత్త షేర్లను గరిష్టాల్లో కొనొద్దని, బదులుగా ఎక్స్చేంజ్‌‌‌‌ ట్రేడెడ్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ (ఈటీఎఫ్‌‌‌‌) లలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు. 12 ప్రభుత్వ కంపెనీల షేర్లతో సీపీఎస్‌‌‌‌ఈ ఈటీఎఫ్‌‌‌‌ ఏర్పడింది. ఇందులో పెట్టాలన్నారు.