మునుగోడులో బై పోల్ హీట్ పీక్ స్టేజీకి చేరింది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తూ..ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలో మాజీ ఎంపీ భూర నర్సయ్య గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధాని మోడీ సంక్షేమ పథకాలను బూర నర్సయ్య గౌడ్ ప్రజలకు వివరిస్తుండగా గులాబీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు వారికి పోటీగా నినాదాలతో చేయడంతో తోపులాట జరిగింది.
బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపుచేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. అభివృద్ధిపై చర్చకు రావాలని జై కేసారంకు ఇన్ఛార్జీగా ఉన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి సవాల్ విసిరారు బూర నర్సయ్యగౌడ్.