
రాత్రివేళ డ్యూటీలో ఉన్న పోలీసులు రోడ్డు ప్రమాదాల్లో గురికావడం ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. విధి నిర్వహణలో ఉండగా వాహనాలు ఢీకొని కొందరు మృతిచెందగా.. మరికొందరు గాయాలపాల వుతున్నారు. ప్రమాదవశాత్తు కొన్ని ప్రమాదాలు జరుగుతుంటే క్రిమినల్స్ దుశ్చర్యలవల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి..తాజాగా సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకలగూడ చిల్లరోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కారు ఢీనడంతో కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అక్టోబర్ 18 బుధవారం చిలకలగూడ చిల్ల రోడ్డులో రాత్రి డ్యూటీలో భాగంగా వాహనాలను గోపాలపురం స్టేషన్ పోలీసులు తనఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారును ఆపేందుకు కానిస్టేబుల్ మహేష్ ప్రయత్నించాడు. వేగంగా దూసుకు వచ్చిన కారు మహేష్ ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన మహేష్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Also Read :- HCA లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల కలకలం
A constable on night duty got severely injured after an unknown car in the Gopalapuram police station limits at the Chilkalguda Chilla road on October 18, Wednesday.
— The Siasat Daily (@TheSiasatDaily) October 19, 2023
According to reports, constable PC Mahesh was moved to a hospital immediately after the hit. A CCTV video of the… pic.twitter.com/IzZfmGPkwp