న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్. స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రాగా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆడటం డౌట్‌గా మారింది. కుడి తొడ కండర గాయం నుంచి కేఎల్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పితో ఇబ్బందిపడుతున్నాడు. దీంతో ధర్మశాల టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండే చాన్స్ లేదు.
రాహుల్ ప్రస్తుతం లండన్ వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులతో చర్చించి గాయంపై ఓ అంచనాకు రావాలని భావిస్తున్నాడు. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఫిట్‌నెస్ సాధించాలని కేఎల్ కోరుకుంటున్నాడు. ఒకవేళ మెగా లీగ్ వరకు ఫిట్‌నెస్ సాధిస్తే కెప్టెన్సీతో పాటు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. లీగ్‌లో ఆటను బట్టే టీ20 వరల్డ్‌కప్‌కు బెర్త్ కన్ఫామ్ చేయనున్నారు. రాహుల్ గైర్హాజరీతో రజత్ పటీదార్ టీమ్‌తో పాటే కంటిన్యూ కానున్నాడు. అయితే రాహుల్ ప్లేస్‌లో దేవదత్ పడిక్కల్‌కు తుది జట్టులో చాన్స్ దక్కొచ్చు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ప్రతి మ్యాచ్ కీలకం కావడంతో ధర్మశాలలో బుమ్రాను ఆడించేందుకు మేనేజ్‌మెంట్ రెడీ అవుతోంది.