కరెంటు పోదని చెప్పంగనే.. కట్

కరెంటు పోదని చెప్పంగనే.. కట్
హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతుండగా…

జనగామ, వెలుగు: హోం మంత్రి మహమూద్​ అలీ స్పీచ్​కు కరెంట్​అడ్డుపడింది. జనగామలో ఆదివారం మున్సిపోల్స్‌‌‌‌ ప్రచారంలో భాగంగా ముస్లిం మైనారిటీలతో సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నం.. కరెంటు పోనే పోదని అంటుండగా కరెంట్​ పోయింది. అయితే ‘ప్రతిపక్ష పార్టీలోళ్లు కావాలని ఫీజు తీసేసిన్రట.. వాళ్ల ఆటలు సాగవ్.. గాల్లెవలో దొరికితే మావోళ్లు ఈపులు సాప్​ జేత్తరు’’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనడంతో అంతా నవ్వారు. ఇంతలోనే కరెంట్​ వచ్చింది.

see also: 

టఫ్ ఫైట్ : ప్రధాన పార్టీలకు పరీక్ష..

ఫోన్​ రీచార్జ్​తో బీమా : రూ.2 లక్షల కవరేజ్

మైనర్​పై అత్యాచారం : యువకుడికి దేహశుద్ధి