కేటీఆర్ సభలో నిరసనలు.. ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు

కామారెడ్డి జిల్లా : బాన్సువాడ పట్టణంలో ఇవాళ (అక్టోబర్​ 4న) మంత్రి కేటీఆర్ పర్యటించారు. బాన్సువాడ బహిరంగ సభలో బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు అనుకున్న సంఖ్య ప్రకారం జనం రాలేదు. ఎక్కువ కుర్చీలు ఖాళీగా కనిపించడంతో మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 

బాన్సువాడ పట్టణంలో జరిగిన బీఆర్​ఎస్​ సభలో మంత్రి కేటీఆర్​ ప్రసంగిస్తుండగా కాయితి లంబాడీలు ఆందోళన చేపట్టారు. తమను ఎస్టీలో చేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.