- బీఆర్ఎస్లో గ్రూప్ పాలిటిక్స్
- పార్టీకి విధేయంగా ఉంటూనే నిరసన గళం
- అభ్యర్థులను ప్రకటించినా టికెట్లపై నేతల ఆశలు
- తమకే టికెట్ ఇవ్వాలంటూ బల ప్రదర్శనలు
- సత్యాగ్రహ దీక్షలు చేస్తున్న మరికొందరు
- అసంతృప్తులు పార్టీలోనే కొనసాగేలా అధినాయకత్వం ప్రయత్నాలు
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీపై విధేయత చాటుతూనే కొందరు గులాబీ లీడర్లు గ్రూప్ పాలిటిక్స్‌కు తెర తీస్తున్నారు. బీఆర్ఎస్లో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయినప్పటికీ టికెట్ల కోసం కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు సత్యాగ్రహ దీక్షలు చేస్తుండగా, మరికొందరు బలప్రదర్శనలకు దిగుతున్నారు. ఇలా చేస్తున్న లీడర్లంతా కేసీఆర్‌పై వీరవిధేయత ప్రకటిస్తున్నారు. పార్టీ లైన్లోనే ఉంటామని చెబుతూనే తమకు చాన్స్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి 20 రోజులైపోయినా పార్టీలో అసంతృప్తి చల్లారకపోగా అసమ్మతి గళాలు క్రమేణా పెరుగుతున్నాయి. టికెట్‌దక్కని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్బహిరంగంగానే మంత్రి పువ్వాడపై కామెంట్లు చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి జోక్యం ఏమిటని మండిపడ్డారు. ఇలా మాట్లాడుతున్న నేతలంతా కేసీఆర్‌పై విధేయత ప్రదర్శిస్తూనే.. మరోవైపు తమ నిరసనను తెలియజేస్తున్నారు.
ఎక్కడెక్కడ అసమ్మతి ఉందంటే..
ఉమ్మడి మెదక్జిల్లాలో ఇద్దరు లీడర్లు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటిస్తూనే టికెట్‌కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన నీలం మధు తనకు టికెట్ఇవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్‌లకు నాలుగు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా బల ప్రదర్శనతో పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. మధుకు ఎమ్మెల్యే టికెట్ఇవ్వలేకపోతే మెదక్ ఎంపీ సీటు నుంచి ఆయన పేరు పరిశీలించే అవకాశమున్నట్టుగా గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.
జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఢిల్లీ వసంత్సత్యాగ్రహ దీక్షలతో పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘‘మట్టి మనుషుల మనోగతం – భూమి పుత్రుల ఆకలి కేక” పేరుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి మట్టిని తీసుకువచ్చి 72 గంటల పాటు సామూహిక ప్రార్థనలు, సత్యాగ్రహ దీక్ష చేశారు. జహీరాబాద్‌లోని ట్రెడెంట్ షుగర్ ఫ్యాక్టరీని అక్కడే కొనసాగించేందుకు దీని ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నించి రూ.6 కోట్లు ఇచ్చేలా పలువురితో ప్రకటన చేయించారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞత తెలుపుతూ రవీంద్రభారతిలో దేశంలోని దళిత మేధావులు, పలు వర్సిటీల వీసీలతో భారీ సమావేశం నిర్వహించానని.. స్థానికుడినైన తనకే టికెట్ఇవ్వాలని వసంత్ డిమాండ్చేస్తున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్‌పై సిట్టింగ్ఎమ్మెల్యే రాజయ్య ఇంకా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ఎమ్మె ల్సీ కడి యం శ్రీహరిని అభ్యర్థిగా ప్రకటించినా బీఫామ్తనకే వస్తుందని ఆయన ధీమాగా చెప్పుకుంటున్నారు. ‘‘స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలు ‘కేసీఆర్అక్కడ – రాజన్న ఇక్కడ’ అని అనుకుంటున్నారు. నియోజకవర్గాన్ని రాజన్నే అభివృద్ధి చేసిండు కాబట్టి ఆయనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు” అని రాజయ్య తెలిపారు. అభ్యర్థులను ప్రకటన టైమ్ లోనే కొందరిని మార్చుతానని కేసీఆర్ ప్రకటించారని, తనకే టికెట్వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.
మెదక్ ఎమ్మెల్యే టికెట్తన కొడుకుకు ఇవ్వకపోవడానికి మంత్రి హరీశ్ రావే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటిస్తూనే ఉన్నారు. శనివారం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న మైనంపల్లి.. అక్కడ మాట్లాడుతూ తాను గెలిచిన తర్వాత పార్టీ మారే వ్యక్తిని కాదని అన్నారు. తన రాజకీయ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకో పది, 15 రోజుల సమయం పడుతుందని చెప్పారు.
మానకొండూరు టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఒకానొక దశలో పార్టీని వీడాలని అనుకున్నా అధిష్టానం జోక్యంతో వెనక్కి తగ్గారు. పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. తనకు కేసీఆర్‌పై నమ్మకం ఉందని.. ఆయన ఏ అవకాశం కల్పించినా పని చేసేందుకు సిద్ధమని చెబుతున్నారు.
జనగామ టికెట్ పెండింగ్‌లో పెట్టినా గురువారం వరకు సిట్టింగ్ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటాపోటీగా ప్రయత్నిం చారు. ఇద్దరు లీడర్లు కేసీఆర్‌పై విశ్వాసం ప్రకటిస్తూనే ఒకరినొకరు తిట్టిపోసుకు న్నారు. జనగామకు వెళ్లొద్దని పల్లాకు కేటీఆర్అల్టిమేటం ఇచ్చిన తర్వాత ముత్తి రెడ్డిలో టికెట్‌పై నమ్మకం పెరిగింది. కేసీ ఆర్సార్తనకే టికెట్ఇవ్వబోతున్నారని అనుచరులకు ఆయన చెప్పుకుంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలకు బాస్నచ్చజెప్పారని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానేనని చెబుతున్నారు.