ఫోన్ మాట్లాడుతూ.. హీటర్ చంకలో పెట్టుకున్నాడు

ఫోన్ మాట్లాడుతూ.. హీటర్ చంకలో పెట్టుకున్నాడు

సెల్ ఫోన్ మాట్లాడుతూ మతిమరుపుతో  ఒక్కోసారి  ఏం చేస్తామో అర్థం కాదు.. మాటల్లో పడి చేయాల్సిన పనిని పక్కకు పెడతాం.. ఒక్కోసారి ఆ నిర్లక్ష్యం  మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంది.  లేటెస్ట్ గా ఖమ్మం జిల్లాలో  సెల్  ఫోన్ మాట్లాడుతూ.. నీళ్లలో పెట్టాల్సిన హీటర్ ను చంకలో  పెట్టుకుని ఆన్ చేశాడు ఓ వ్యక్తి.. దీంతో అతను విద్యుత్  కొట్టి అక్కడిక్కడే  మృతి చెందాడు.

ఖమ్మం జిల్లాలో దోనెపూడి మహేశ్ బాబు (40) ఆగస్టు 11 రాత్రి ఆయన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయబోయారు. ఈ లోపు  ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. హీటర్‌ను నీటిలో బదులు చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయారు.   దీంతో అప్రమత్తమైన భార్య దుర్గాదేవి..అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.