వాహనాలు తనిఖీలు చేస్తుండగా మందు బాబుల హంగామా

వేములవాడ, వెలుగు :   రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో  మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మందు బాబులు హంగామా చేశారు.  చందుర్తి మండల కేంద్రానికి చెందిన దండుగుల రెడ్డి, గట్టయ్యతో పాటు మరికొంతమంది మందు తాగి  రెండు బైక్‌‌లపై వస్తూ పట్టుబడ్డారు. 

ఈ క్రమంలో వాహనాలు తనిఖీ చేస్తున్న  ట్రాఫిక్​ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. పోలీస్​ వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన కానిస్టేబుళ్లపై దాడికి దిగారు.  వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.  స్టేషన్​లో సైతం పోలీసులను, సీఎం కేసీఆర్​ను, మంత్రి కేటీఆర్​ను నోటికి వచ్చినట్లు తిడుతూ రెండు గంటల పాటు వీరంగం చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్​తెలిపారు.