- విప్ఆది శ్రీనివాస్
ముస్తాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్లలో భూ కబ్జాలకు పాల్పడినవారికి కేటీఆర్ వంత పాడుతున్నాడని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం ఓ ప్రైవేట్ పెట్రోల్ బంక్ ఓపెనింగ్ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. అనంతరం మండలకేంద్రంలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జిల్లాలో సుమారు 2వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ పార్టీ లీడర్లు కబ్జా చేశారని విమర్శించారు.
సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా కబ్జాలో ఉందన్నారు. ఫార్ములా ఈ రేస్ స్కామ్‌లో ఇరుక్కున్న కేటీఆర్... రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము రేస్ నిర్వహించినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ రేసు ద్వారా రాష్ట్రానికి దాదాపుగా 700 కోట్లు లాభం వచ్చిందంటున్నారని, మరి ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాలో ఎందుకు జమ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లీడర్లు కనమెని చక్రధర్‌రెడ్డి, బాల్ రెడ్డి, గజ్జెల రాజు, గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, దీటి నర్సింహులుపాల్గొన్నారు.