ఆ నలుగురి వల్లే రాష్ట్రం అప్పుల పాలు : విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆ నలుగురి వల్లే రాష్ట్రం అప్పుల పాలు  : విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కేసీఆర్​ కుటుంబం తెలంగాణను దోచుకున్నది : విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని, వాళ్లు చేసిన అప్పులకు తాము వడ్డీలు చెల్లిస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గవర్నర్ ప్రసంగంపై గురువారం అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శనేశ్వరంగా మారిందన్నారు. పదేండ్లలో భూ బకాసురులు వేల ఎకరాల భూములను కబ్జా చేశారని, కల్వకుంట్ల కుటుంబం కమీషన్ల కుటుంబంగా మారి రాష్ట్రాన్ని దోచుకుందని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. 

ఆ కుటుంబంలోని నలుగురి వల్లే తెలంగాణ సర్వనాశనమైందని, అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆరోపించారు. బీసీల పట్ల చిత్తశుద్ధితోనే ప్రభుత్వం కులగణన చేసిందని, అయితే, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు కులగణన చర్చలో పాల్గొనలేదన్నారు. ఇది బీసీలను అవమానించడమేనన్నారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి మిగిలిన అన్ని పథకాలను బంద్ చేశారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చినప్పుడే ఆ పార్టీకి తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక ఇతర రంగాల్లో అగ్రగామి ఉందని పేర్కొన్నారు. గ్రూపు –1 పరీక్షలు నిర్వహించడంతో పాటు ఫలితాలు వెల్లడించిందన్నారు. ఇప్పటివరకు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో విధ్వంసం: వేముల వీరేశం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గవర్నర్ ప్రసంగంపై రెండో రోజు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టగా.. ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించారని, గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అవమానించిన తీరును ప్రజలు గమనించారన్నారు. ప్రజా పాలనలో ఏడాదిలో అమలైన సంక్షేమ పథకాల అమలు తీరును గవర్నర్ నిండు మనసుతో చదువుతుంటే బీఆర్ఎస్ సభ్యులు అరుపులు, కేకలతో సభలో వ్యవహరించిన తీరును చూసి, ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. పదేండ్లలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సీఎం, మంత్రులు గొప్ప విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. గడిచిన పదేండ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని దుయ్యబట్టారు.