ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం ఎకరం స్థలం కేటాయిస్తాం : ఆది శ్రీనివాస్

ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం  ఎకరం స్థలం కేటాయిస్తాం  : ఆది శ్రీనివాస్
  • విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల/వేములవాడవెలుగు: సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు కోసం ఎకరం స్థలం, నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. సోమవారం అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయంతి సందర్భంగా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో ఎదిగానని వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఆమోదించిందని, ఈ బిల్లు బలపరిచే అవకాశం ఓ బీసీ బిడ్డగా తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. 

జిల్లాలోని ఎస్సీల సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.  అంతకుముందు వేములవాడ పట్టణంలో సుందరీకరించిన అంబేద్కర్​చౌరస్తా, కాంస్య విగ్రహాన్ని విప్​ఆవిష్కరించారు. ఆది శ్రీనివాస్​మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన వెంట కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.గీతే, జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగుల సత్యనారాయణ, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, జిల్లా ఆఫీసర్లు రాజామనోహర్ రావు, విజయలక్ష్మి, సిరిసిల్ల, వేములవాడ కమిషనర్లు సమ్మయ్య, అన్వేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దళిత సంఘం నాయకులు ఉన్నారు.