బీసీలకు మరింత మేలు చేసేందుకే మళ్లీ కులగణన

బీసీలకు మరింత మేలు చేసేందుకే మళ్లీ కులగణన
  • విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: బీసీలకు మరింత మేలు చేసేందుకే మరోసారి కులగణన సర్వే జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని విప్ ఆది శ్రీనివాస్  అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. 

బీసీలకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే.. తమను అభినందించాల్సింది పోయి తిరిగి సర్వే చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు వారి విజయంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 20 శాతానికి తగ్గించింది అప్పటి బీఆర్ఎస్ సర్కారేనని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు బీసీలపై మొసలి కన్నీరు కార్చడం ఏమిటని ప్రశ్నించారు.