అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌లో పశ్చాత్తాపం లేదు : విప్ ఆది శ్రీనివాస్

 అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌లో పశ్చాత్తాపం లేదు : విప్ ఆది శ్రీనివాస్
  • రేవతి కుటుంబంపై సానుభూతి చూపలేదు: విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, వెలుగు: సినీ హిరో అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని, ఆయనలో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని విప్‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ అన్నారు. రేవతి కుటుంబంపైన అల్లు అర్జున్ కనీసం సానుభూతి చూపించడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పుపట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందని మండిపడ్డారు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చేసిన ప్రస్తావన పైనే సీఎం స్పందించారన్నారు.

తొక్కిసలాటలో ఇద్దరు చనిపోయారని అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌కి పోలీసులు చెప్పిన తర్వాత కూడా థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షో చేశారని ఆరోపించారు. ‘‘అల్లు అర్జున్ సమాజంలో నీ గురించి ఏమనుకుంటున్నారో అడిగి చూడు. నీ వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాబు గురించి ఆలోచన లేదు. నీ పేరు ప్రతిష్టలు అవతలి వారి ప్రాణాల కంటే ఎక్కువా”అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

 అల్లు అర్జున్ ఇంకా దబాయించి మాట్లాడుతున్నాడని, పోలీసులు ఇచ్చిన అధికారిక సమాచారాన్నే సీఎం అసెంబ్లీలో మాట్లాడారన్నారు. అల్లు అరవింద్ మాటలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని, తన కొడుకు మూడీగా ఉంటున్నాడని ఆయన అంటున్నారని, అవతల ఒక ప్రాణం ఐసీయూలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉందని గుర్తుచేశారు.