మోదీ కోవర్టు కేసీఆరే : ఆది శ్రీనివాస్

మోదీ కోవర్టు కేసీఆరే : ఆది శ్రీనివాస్
  • విప్ ఆది శ్రీనివాస్ మండిపాటు

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీకి ఫేవరెట్, అసలైన కోవర్టు కేసీఆరేనని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. బీజేపీపై యుద్ధం చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డేనని, బీజేపీపై వ్యతిరేక పోరాటంలో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఏంటో అందరికీ తెలుసని అన్నారు. మోదీ మెప్పు కోసం తెలంగాణ తల్లికి ద్రోహం చేసింది, చేస్తున్నదీ కేసీఆరేనని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కల్వకుంట్ల కుటుంబం దాసోహం అయిందని, బీజేపీకి లాభం చేయడానికి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెట్టి జాతీయ స్థాయిలో హడావుడి చేసింది కేసీఆర్ కాదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.

 కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం చేసేందుకు కేంద్రం సహకారం కావాలని మోదీని కోరింది కేసీఆర్ అని అన్నారు. రేవంత్ రెడ్డిపై ఉన్న ద్వేషంతో బీజేపీని గెలిపించి బీఆర్ఎస్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకుందన్నారు. బీజేపీతో కుమ్మక్కై లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సహకరించిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని ఆడిపోసుకోవడమే కేటీఆర్, హరీశ్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆ ఇద్దరి బతుకంతా అబద్ధాల ప్రచారమేనన్నారు. అధికారంలో ఉన్న పదేండ్లపాటు రైతులను బలిగొని ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ఫైర్ అయ్యారు.