మమ్మల్ని అడ్డుకున్న  విషయాన్ని మరిచిపోయారా?..కేటీఆర్ పై విప్ అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను అడుగడుగునా అడ్డుకున్న విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరిచిపోయారా అని విప్ అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీశ్ రావులు జిల్లాల్లో పర్యటించినప్పుడు ఆ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టులు చేసిన విషయాలను అప్పుడే మరిచిపోయారా అని అడిగారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పోలీసులపై విమర్శలు చేయడం సరికాదన్నారు.