మల్లన్నసాగర్‌‌‌‌ భూనిర్వాసితుల సమస్యలపై చర్చకు సిద్ధం

మల్లన్నసాగర్‌‌‌‌ భూనిర్వాసితుల సమస్యలపై చర్చకు సిద్ధం
  • హరీశ్‌‌రావుకు విప్ లక్ష్మణ్ సవాల్‌‌

హైదరాబాద్, వెలుగు: మల్లన్నసాగర్ భూనిర్వాసితుల సమస్యలపై బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌ రావుతో చర్చించేందుకు తాను సిద్ధమని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ చేశారు. శుక్రవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. తేదీ, సమయం, వేదిక చెబితే బహిరంగ చర్చకు తాను రెడీ అన్నారు.

 మల్లన్నసాగర్‌‌‌‌పై చర్చకు కేసీఆర్‌‌‌‌ను హరీశ్‌‌ తీసుకొస్తే.. సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తారని చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్, చొప్పదండి, ధర్మపురి.. ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని లక్ష్మణ్​కుమార్​ తెలిపారు.