
వేములవాడ, వెలుగు : మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో పలువురు సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా వేములవాడ అభివృద్ధికి రూ.100కోట్లు ఇస్తానన్న కేసీఆర్.. రాజన్ననే మోసం చేశాడన్నారు.
ప్రజా ప్రభుత్వంలో బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా మర్రిపల్లి రిజర్వాయర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేశ్, అర్బన్, రూరల్ తహసీల్దార్లు విజయ ప్రకాశ్‌రావు, ఎండీ అబూబకార్ పాల్గొన్నారు.