కాంగ్రెస్ గెలుపులో ఎన్నారైలది కీలక పాత్ర : లండన్​లో విప్ బీర్ల అయిలయ్య

కాంగ్రెస్ గెలుపులో ఎన్నారైలది కీలక పాత్ర : లండన్​లో విప్ బీర్ల అయిలయ్య

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో ఎన్నారైల పాత్ర కీలక మని విప్ బీర్ల అయిలయ్య అన్నారు. లండన్ పర్యటనలో భాగంగా సోమవారం అక్కడి ఎన్నారైలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటి వరకు రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారని తెలిపారు. తెలంగాణ యువత ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సరే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే విధంగా వారిని తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనిర్సిటీని స్థాపించామని చెప్పారు.