సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్ : గంప గోవర్ధన్

కామారెడ్డి, వెలుగు: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​పేర్కొన్నారు. శనివారం మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లోని చుక్కాపూర్, ఫరీద్​పేట, వాడి, భవానిపేట, ఆరేపల్లి, వెల్పుగొండ గ్రామాల్లో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ఆయా చోట్ల గంప గోవర్ధన్​ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ ఆలయాలను ఆధ్మాత్మిక క్షేత్రాలుగా తీర్చి దిద్దుతున్నారన్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. కామారెడ్డి అభివృద్ధి కోసమే కేసీఆర్​ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎంపీపీ నర్సింగ్​రావు, జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, వైస్​ఎంపీపీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.