
కమలాపూర్, వెలుగు: కేసీఆర్ పరిపాలన దక్షతతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం కమలాపూర్ మండలంలోని గూడూరు, కన్నూరు, శంభునిపల్లి గ్రామాల్లో కొత్త భవనాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఈటెల చేసిందేమీ లేదని విమర్శించారు. అభివృద్ధి చేస్తున్న తనను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల ఎన్నికలలో అత్యధిక మెజార్టీ ఇచ్చే నియోజకవర్గం హుజురాబాద్ అవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకాంత్, జడ్పీటీసీ కల్యాణి, సర్పంచులు పెండ్యాల రవీందర్ రెడ్డి, అంకతి సాంబయ్య, పుల్లూరి రామచందర్రావు, ఎంపీటీసీలు లక్ష్మి, భాస్కరరావు, ఎంపీడీవో పల్లవి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.